ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 సీజన్లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ దిగ్గజ టీంలు ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి జట్టు ముంబయికి బ్యాటింగ్ అప్పగించింది. బ్యాటింగ్‌కి దిగిన రోహిత్ సేన 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 సీజన్లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ దిగ్గజ టీంలు ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ సారథి, దేశానికి మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన మహేంద్ర సింగ్ ధోనికి అరుదైన గౌరవం దక్కింది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్( ఎంసీఎ ) ధోనిని సగర్వంగా సత్కరించింది.
MI ట్విట్టర్లో షేర్ చేసిన వీడియోలో, ధోనీ, ఇషాన్ కిషన్ IPL యొక్క 'ఎల్ క్లాసికో'కి ముందు చాట్ చేస్తూ కనిపించారు. అదే వీడియోలో 'మాస్టర్ బ్లాస్టర్' సచిన్ టెండూల్కర్ కూడా వాంఖడే స్టేడియంను సందర్శించారు. MI కెప్టెన్ రోహిత్ శర్మతో సహా ఆటగాళ్లతో సచిన్ టెండూల్కర్ సంభాషించాడు.
నేను CSKతో ఆడినప్పుడు, నేను చాలా చిరాకుగా ఉండేవాడిని. తాను అతనితో చాలా చిరాకుపడ్డాను.. (స్క్రీన్‌పై ఆడిన ఒక సంఘటనను వివరిస్తూ) అతను హేజిల్‌వుడ్‌కు ఫైన్ లెగ్ వేస్తాడు.. కాబట్టి అతను ఈ యాంగిల్లో బౌలింగ్ చేస్తాడని నాకు తెలుసు. (బయట-ఆఫ్). తాను అక్కడ బౌండరీని (డీప్ పాయింట్) సాధించడానికి ప్రయత్నించి.. ఔట్ అయ్యాను. మీరు ఆడటం అలవాటు లేని ప్రాంతాల్లో ఆడమని ఎంఎస్ ధోని మిమ్మల్ని బలవంతం చేశాడు.
చెన్నై విమానాశ్రయంలో సీఎస్కే టీమ్ ఫ్లైట్ ఎక్కింది. అయితే ఈ విషయం తెలుసుకున్న పైలెట్ విమానం టేకాఫ్ అయ్యే ముందు ఓ అనౌన్స్ మెంట్ ఇచ్చాడు. అలా ధోనీతో ఆ పైలెట్ మాట్లాడాడు. ఎంఎస్ ధోని నేను మీకు పెద్ద అభిమానిని.. దయచేసి ఇంకొంత కాలం మీరు సీఎస్కే టీమ్ కు కెప్టెన్ గా కొనసాగండి.. ఈ సారి మాత్రం మీరు రిటైర్మెంట్ ప్రకటించొద్ద అంటూ కోరాడు.
CSK సారథి MS ధోని, ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌లను కలిసిన భారత మాజీ ఓపెనర్ క్రిస్ శ్రీకాంత్ స్వాగతించడం వీడియోలో ఉంది. ముంబై ఇండియన్స్‌తో జరగబోయే మ్యాచ్‌కు ముందు చెన్నై కెప్టెన్‌కి శ్రీకాంత్ దీవెనలు ఇవ్వడం కనిపిస్తుంది.
ఐకానిక్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో నెలకొల్పబడిన ప్రతిష్టాత్మకమైన మేరిల్బోన్ క్రికెట్ క్లబ్ (MCC) ప్రపంచ కప్ విజేత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు మరో నలుగురు ప్రముఖ భారత అంతర్జాతీయ ఆటగాళ్లకు బుధవారంనాడు 'లైఫ్ మెంబర్షిప్' ఇచ్చింది.
ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో చెన్నై సూపర్ సింగ్స్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్(57), ఓపెనర్ డేవాన్ కాన్వే(47) అద్భుతంగా రాణించారు. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ చివరి ఓవర్లో వచ్చిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అదిరిపోయే సిక్సర్లు బాదడం విశేషం.