చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఒక నిర్ణయం తీసుకున్నాడంటే అందులో 99 శాతం సరైన ఫలితమే కనిపిస్తుంది. ఇప్పటికే ఇది చాలా సార్లు నిరూపితమైంది. అంతర్జాతీయ మ్యాచ్ లు.. ఐపీఎల్ ఇలా ఏదైనా సరే తన మాస్టర్ మైండ్ తో మ్యాచ్ లు తారుమారు చేసిన సందర్భాలు కోకొల్లలు. తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ధోని మరోసారి తన మాస్టర్ మైండ్ పవర్ రుచి చూపించాడు. విషయంలోకి వెళితే.. ఇన్సింగ్స్ ఎనిమిదో ఓవర్ మిచెల్ సాంట్నర్ చేశాడు. అంతకుముందు ఓవర్లోనే ఇషాన్ కిషన్ పెవిలియన్ చేరడంతో సూర్యకుమార్ క్రీజులోకి వచ్చాడు. ఇక ఓవర్లో సాంట్నర్ వేసిన రెండో బంతి వైడ్ అనే ఉద్దేశంతో సూర్య వదిలేయడం.. ధోని షార్ప్ గా స్పందించి బాల్ అందుకోవడం జరిగిపోయాయి.
Also Read : Rahane-Dhoni: ఎంఎస్ ధోని మాటలను రివీల్ చేసిన రహానే..
దీంతో ధోని అంపైర్ కు క్యాచ్ ఔట్ కు అప్పీల్ చేశాడు. అయితే గ్లోవ్స్ కు తగిలి వెళ్లినట్లు అనిపించడంతో సూర్య కుమార్ యాదవ్ కూడా వెళ్లడానికి సిద్ధమయ్యాడు. కానీ అంపైర్ వైడ్ ఇవ్వడంతో సూర్య ఆగిపోయాడు. వెంటనే ధోని క్యాచ్ కోసం రివ్యూ కోరాడు. రిప్లేలో బంతి గ్లోవ్స్ కు తగిలినట్లు తేలింది. దీంతో సూర్యకు తప్పలేదు. ఇక ధోని రివ్యూ తీసుకోవడంపై అభిమానులు వినూత్న రీతిలో స్పందించారు. డీఆర్ఎస్ అంటే ధోని రివ్యూ సిస్టమ్ అంటూ కామెంట్ చేశారు. ఇక ఐపీఎల్ లో సూర్యకుమార్ వైఫల్యం కొనసాగుతుంది. తొలి మ్యాచ్ లో తక్కువ స్కోర్ కే వెనుదిరిగిన సూర్య ఈ మ్యాచ్ లో దారుణంగా ఆడి ఒక్క పరుగుకే ఔటయ్యాడు. ఐపీఎల్ కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లోనూ దారుణమైన ప్రదర్శనను సూర్య కుమార్ యాదవ్ కనబరిచాడు. టీ20లు మాత్రమే బాగా ఆడగలడు అని పేరున్న సూర్య తాజాగా టీ20ల్లో విఫలం అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Also Read : Janhvi Kapoor: అమ్మో నీ అమ్మ గొప్పదే.. అందం పోగేసి కన్నదే