MS Dhoni entertained fans Says Virender Sehwag: ఎంఎస్ ధోనీని చూడటానికే క్రికెట్ అభిమానులు ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లను చూసేందుకు వస్తున్నారని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. మ్యాచ్‌ను చూడటానికి వచ్చే అభిమానులు టికెట్ కొనుగోలు చేసిన మొత్తానికి మహీ ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నాడన్నాడు. చెన్నై విజయం సాధించినా, ఓడిపోయినా అభిమానులకు అవసరం లేదని.. ధోనీ బాగా ఆడితే చాలని సెహ్వాగ్ పేర్కొన్నాడు. గుజరాత్‌పై ఓడిన చెన్నై.. ప్లే ఆఫ్స్…
Harbhajan Singh Fires on MS Dhoni: ఆదివారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్స్ రేసులో ముందడుగు వేసింది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న చెన్నై ఖాతాలో 12 పాయింట్స్ ఉన్నాయి. మిగిలిన మూడు మ్యాచుల్లో రెండు గెలిచినా.. యెల్లో ఆర్మీ ప్లేఆఫ్స్ చేరుతుంది. అయితే పంజాబ్ మ్యాచ్‌లో చెన్నై మాజీ కెప్టెన్…
CSK Bowing Coach Eric Simons Hails MS Dhoni Batting: ఐపీఎల్ 2023 తర్వాత మోకాలికి శస్త్రచికిత్స జరిగినా, అప్పుడప్పుడు మళ్లీ నొప్పి తిరగబెడుతోన్నా.. అభిమానుల కోసమే ఎంఎస్ ధోనీ బ్యాటింగ్‌కు వస్తున్నాడని చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ ఎరిక్ సిమన్స్ తెలిపాడు. ప్రతిసారి ధోనీ తన బ్యాటింగ్‌తో తమని ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉన్నాడని, మహీతో దగ్గరగా ఉండి పనిచేయడం అద్భుతం అని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో ధోనీ క్రీజులోకి వచ్చాడంటే.. సిక్సులు…
MS Dhoni Hat-Trick Sixes Video Goes Viral: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అదరగొడుతున్నాడు. తనదైన షాట్లతో మునుపటి ధోనీని గుర్తుచేస్తున్నాడు. ధనాధన్ షాట్లతో మైదానంలోని ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటీవల విశాఖలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ.. 16 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌పై మహీ మరోసారి…
Stephen Fleming Praised MS Dhoni’s Innings in IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు అని సీఎస్‌కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. తీవ్రమైన గాయం నుంచి కోలుకుని వచ్చిన మహీ నుంచి ఇలాంటి ఆటతీరును ఊహించలేదన్నాడు. మునుపటి ధోనీని గుర్తుచేశాడని, మహీ షాట్లను తాను ఎంజాయ్ చేశానని ఫ్లెమింగ్ చెప్పుకొచ్చాడు. ఆదివారం విశాఖలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిదో…
MS Dhoni Slams 37 Not Out Off 16: అభిమానులు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ చూసి ఏడాది అవుతోంది. ఈ సీజన్‌లో చెన్నై ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడినా.. ధోనీ బ్యాటింగ్‌కు దిగలేదు. దాంతో మహీ ఎప్పుడు బ్యాటింగ్‌కు వస్తాడోనని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూశారు. ఆదివారం అభిమానుల ఆశ నెరవేరింది. వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మహీ తన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. ఢిల్లీ…
CSK Coach Michael Hussey on MS Dhoni Did Not Bat in IPL 2024: ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ రెండు మ్యాచ్‌లు ఆడింది. బెంగళూరు, గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లలో చెన్నై అద్భుత విజయాలు అందుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో చెన్నై ప్లేయర్స్ అదరగొట్టారు. అయితే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బ్యాటింగ్‌ను చూసే అవకాశం మాత్రం అభిమానులకు ఇంకా దక్కలేదు. గుజరాత్‌తో మ్యాచ్‌లో మహీ బ్యాటింగ్‌కు వస్తాడనుకుంటే.. అతడికంటే…