MS Dhoni: ఎంఎస్ ధోనీ ఇలా ఆడుతాడని అస్సలు ఊహించలేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stephen Fleming Praised MS Dhoni’s Innings in IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు అని సీఎస్‌కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. తీవ్రమైన గాయం నుంచి కోలుకుని వచ్చిన మహీ నుంచి ఇలాంటి ఆటతీరును ఊహించలేదన్నాడు. మునుపటి ధోనీని గుర్తుచేశాడని, మహీ షాట్లను తాను ఎంజాయ్ చేశానని ఫ్లెమింగ్ చెప్పుకొచ్చాడు. ఆదివారం విశాఖలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ.. ధనాధన్ షాట్లతో అలరించాడు. 16 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. ఇందుకు సంబందించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read: CSK Fan Died: ముంబై అభిమానుల దాడి.. సీఎస్‌కే అభిమాని మృతి!
Also Read
- PM Modi: కిర్గిజ్‌స్థాన్‌లో ‘మానస్’ ప్రత్యక్ష పఠనాన్ని వీక్షించిన మోడీ.. ప్రత్యేకత ఏంటి?
- Ram Mandir CEO: రామ మందిర్ CEOగా జితేంద్ర మిశ్రా.. ‘ఆపరేషన్ సింధూర్‌లో రహస్యం ఉందా?’ కాంగ్రెస్ అనుమానం
- Punjab: ‘‘రేప్ కేసుల సెటిల్మెంట్ దందా’’.. సీఎం మాన్, భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు
- Trump-Iran: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్ ప్రత్యేక సమావేశం.. ఇరాన్ యుద్ధంపై కీలక ప్రకటన చేసే అవకాశం
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ అనంతరం సీఎస్‌కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ… ‘ఎంఎస్ ధోనీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తీవ్రమైన గాయం నుంచి కోలుకుని వచ్చాక ఇలాంటి ఆట తీరును అతడి నుంచి నేను అస్సలు ఊహించలేదు. దూకుడైన బ్యాటింగ్‌తో ధోనీ అందరిని ఆకట్టుకున్నాడు. క్లిష్టమైన మ్యాచ్‌లోనూ మా జట్టుకు సానుకూల అంశం ఇదే. కేవలం ధోనీ వల్లే 20 పరుగుల తేడాతోనే మ్యాచ్‌ను కోల్పోయాం. పెద్ద టోర్నీలలో రన్‌రేట్ ఎంత ముఖ్యమో అతడికి తెలుసు. అందుకే ధోనీ దూకుడుగా ఆడాడు. ఈ ఓటమిపై మేం సమీక్షించుకుంటాం. ఛేదన ఆరంభంలోనే వెనుకబడ్డాం. బౌలింగ్‌లోనూ ఎక్కువగా పరుగులిచ్చాం. డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్ దూకుడుగా ఆడారు. ఢిల్లీ భారీ స్కోరు చేయడానికి కారణం వారిద్దరే’ అని తెలిపాడు.
తాజావార్తలు
-
PM Modi: కిర్గిజ్‌స్థాన్‌లో ‘మానస్’ ప్రత్యక్ష పఠనాన్ని వీక్షించిన మోడీ.. ప్రత్యేకత ఏంటి?
-
Ram Mandir CEO: రామ మందిర్ CEOగా జితేంద్ర మిశ్రా.. ‘ఆపరేషన్ సింధూర్‌లో రహస్యం ఉందా?’ కాంగ్రెస్ అనుమానం
-
Konda Surekha : ‘నన్ను అణచేస్తున్నారు’.. రాహుల్‌కు సురేఖ ఫిర్యాదు.!
-
Punjab: ‘‘రేప్ కేసుల సెటిల్మెంట్ దందా’’.. సీఎం మాన్, భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు
-
Trump-Iran: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్ ప్రత్యేక సమావేశం.. ఇరాన్ యుద్ధంపై కీలక ప్రకటన చేసే అవకాశం
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!