MS Dhoni Batting: రెండు మ్యాచ్‌లలో బ్యాటింగ్‌కు రాని ఎంఎస్ ధోనీ.. కారణం ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CSK Coach Michael Hussey on MS Dhoni Did Not Bat in IPL 2024: ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ రెండు మ్యాచ్‌లు ఆడింది. బెంగళూరు, గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లలో చెన్నై అద్భుత విజయాలు అందుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో చెన్నై ప్లేయర్స్ అదరగొట్టారు. అయితే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బ్యాటింగ్‌ను చూసే అవకాశం మాత్రం అభిమానులకు ఇంకా దక్కలేదు. గుజరాత్‌తో మ్యాచ్‌లో మహీ బ్యాటింగ్‌కు వస్తాడనుకుంటే.. అతడికంటే ముందు యువ ఆటగాడు సమీర్ రిజ్వీ, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాలు వచ్చారు. అప్పటివరకు డ్రెసింగ్ రూంలో సన్నద్ధమన మహీ.. బ్యాటింగ్‌కు రాకుండా అభిమానులను నిరాశపరిచాడు.
అవకాశం ఉన్నా ఎంఎస్ ధోనీ ఎందుకు బ్యాటింగ్‌కు రావడం లేదని అభిమానులు ఆలోచనలో పడ్డారు. మహీ బ్యాటింగ్‌కు రాకపోవడానికి కారణమేంటో చెన్నై కోచ్ మైక్ హస్సీ తెలిపాడు. ఇంపాక్ట్ రూల్‌ను సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతోనే ధోనీ బ్యాటింగ్‌కు రాలేకపోయాడు అని చెప్పాడు. ‘ఎంఎస్ ధోనీ మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. ఇంపాక్ట్ రూల్‌ను సద్వినియోగం చేసుకోవాలని మేం చూశాం. అందుకే ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు జరిగింది. మా ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సూచనల మేరకే ఇలా చేశాం’ అని హస్సీ చెప్పాడు.
Also Read
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
- RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
Also Read: Hardik Pandya: గుజరాత్ టైటాన్స్ బౌలర్లను హార్దిక్ పాండ్యా ఇబ్బంది పెట్టాడా?
‘మ్యాచ్ ముందుకు సాగే కొద్దీ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కీలకం అవుతుంది. అదనంగా బ్యాటర్ లేదా బౌలర్ అవసరమైతే.. అప్పుడు ఆ నిబంధనను ఉపయోగించుకోవాలని మేం భావించాం. అంతేకాకుండా మా బ్యాటింగ్ ఆర్డర్ బలాన్ని పరీక్షించుకున్నాం. ఎంఎస్ ధోనీ 8వ స్థానంలో వచ్చేవాడే. ఆ స్థానంలో దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడు. జట్టులోని ప్రతి బ్యాటర్ వేగంగా ఆడేందుకు ప్రయత్నించాలని ప్రధాన కోచ్ చెప్పాడు. ఒకవేళ దూకుడుగా ఆడుతూ ఔటైనా ఫర్వాలేదని ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తాం’ అని మైక్ హస్సీ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!