MS Dhoni-Six: విశాఖలో చెలరేగిన ఎంఎస్ ధోనీ.. పండగ చేసుకున్న ఫ్యాన్స్! వైరల్ వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni Slams 37 Not Out Off 16: అభిమానులు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ చూసి ఏడాది అవుతోంది. ఈ సీజన్‌లో చెన్నై ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడినా.. ధోనీ బ్యాటింగ్‌కు దిగలేదు. దాంతో మహీ ఎప్పుడు బ్యాటింగ్‌కు వస్తాడోనని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూశారు. ఆదివారం అభిమానుల ఆశ నెరవేరింది. వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మహీ తన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు.
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. రావడమే కాదు ధనాధన్ షాట్లతో అలరించాడు. కేవలం 16 బంతులు మాత్రమే ఆడిన ధోనీ.. 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జ్ వేసిన చివరి ఓవర్‌లో అయితే మహీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 4, 6, 0, 4, 0, 6తో ఏకంగా 20 పరుగులు రాబట్టాడు. ఆ ఓవర్‌లో సింగిల్ హ్యాండ్‌తో కొట్టిన సిక్స్ మ్యాచ్ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. ధోనీ బౌండరీ కొట్టినప్పుడల్లా విశాఖ స్టేడియం దద్దరిల్లింది.
Also Read
Also Read: Off The Record : వైసీపీకి వరంగా మారిన చంద్రబాబు వ్యాఖ్యలు
ఎంఎస్ ధోనీ జోరు చూస్తే.. అతను ఒక ఓవర్ ముందే బ్యాటింగ్‌కు వచ్చి ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ గెలిచేదేమో అభిమానులకు అనిపించింది. మహీ మెరుపు ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ‘తలా ఈజ్ బ్యాక్’, ‘వింటేజ్ ధోనీ విధ్వంసం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఐపీఎల్ 2024లో మహీ మరిన్ని మంచి ఇన్నింగ్స్ ఆడాలని కోరుకుంటున్నారు.
2024? 2005? 🤔#DCvCSK #WhistlePodu #Yellove🦁💛pic.twitter.com/T6tWdWO5lh
— Chennai Super Kings (@ChennaiIPL) March 31, 2024
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!