MS Dhoni: గాయాలు ఉన్నా.. అభిమానుల కోసమే ధోనీ బ్యాటింగ్‌కు వస్తున్నాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CSK Bowing Coach Eric Simons Hails MS Dhoni Batting: ఐపీఎల్ 2023 తర్వాత మోకాలికి శస్త్రచికిత్స జరిగినా, అప్పుడప్పుడు మళ్లీ నొప్పి తిరగబెడుతోన్నా.. అభిమానుల కోసమే ఎంఎస్ ధోనీ బ్యాటింగ్‌కు వస్తున్నాడని చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ ఎరిక్ సిమన్స్ తెలిపాడు. ప్రతిసారి ధోనీ తన బ్యాటింగ్‌తో తమని ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉన్నాడని, మహీతో దగ్గరగా ఉండి పనిచేయడం అద్భుతం అని పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో ధోనీ క్రీజులోకి వచ్చాడంటే.. సిక్సులు బాదుతూ అభిమానులను అలరిస్తున్నాడు. విశాఖలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 16 బంతుల్లో 37 పరుగులు చేసిన ధోనీ.. ముంబై ఇండియన్స్‌పై 4 బంతుల్లో 20 రన్స్ చేశాడు.
వైజాగ్ మ్యాచ్ అనంతరం ఎంఎస్ ధోనీ తన కాలికి ప్రత్యేకమైన పట్టీతో కనిపించాడు. అపుడప్పుడు వచ్చే నొప్పిని భరిస్తూనే ముంబై ఇండియన్స్‌పై హిట్టింగ్ చేశాడు. ఇదే విషయంపై చెన్నై బౌలింగ్ కోచ్ ఎరిక్ సిమన్స్ మాట్లాడుతూ… ‘ముంబై బౌలింగ్‌ను చూసి మా స్కోరు 200ల్లోపే ఉంటుందనుకున్నా. ధోనీ బ్యాటింగ్‌తో 206 పరుగులకు చేరాం. ప్రతిసారి అతడు మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉన్నాడు. మహీతో దగ్గరగా ఉండి పనిచేయడం అద్భుతం. క్రీజ్‌లోకి వెళ్లడంతోనే సిక్స్ బాదడం అంత సులువేం కాదు. అప్పటికే వికెట్ తీసి ఉత్సాహం మీదున్న బౌలర్ (హార్దిక్) ఆటలు ధోనీ ముందు సాగలేదు. నెట్స్‌లో మహీ ప్రాక్టీస్‌ను చూస్తే అసాధారణంగా ఉంటుంది. ప్రాక్టీస్‌లోనిదే మైదానంలో అమలు చేస్తాడు. అందుకే అతడిని మా బ్యాటింగ్ వ్యూహంలో భాగంగా వాడుకుంటున్నాం’ అని అన్నాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: Preity Zinta: ఆస్తులు అమ్మైనా సరే.. రోహిత్ శర్మను దక్కించుకుంటా: ప్రీతీ జింటా
‘డెత్ ఓవర్లలో ఎలా బౌలింగ్ చేయాలో ధోనీ ఆటను చూసి నేర్చుకుంటున్నాం. సీజన్‌కు ముందు నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్స్‌లో మా ప్లాన్లను మహీపైనే ప్రయోగించాం. అది పనికొస్తుంది. ఐపీఎల్ 2023 తర్వాత ధోనీ మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. అప్పుడప్పుడు మళ్లీ ఆ గాయం తిరగబెడుతోంది. అయినా సరే అభిమానుల కోసం ధోనీ బ్యాటింగ్‌కు వస్తున్నాడు. ఇప్పటివరకు నేను చూసిన క్రికెటర్లలో అతడు అరుదైన వ్యక్తి. ఆడాలనుకుంటే నొప్పిని పట్టించుకోకుండా బరిలోకి దిగుతాడు. ఇబ్బంది పడినా జట్టుకు ఏమీ అవసరం, ఏం చేయాలనే దానిపై మహీకి స్పష్టత ఉంది’ అని ధోనీపై ఎరిక్ ప్రశంసలు కురిపించాడు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!