దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సముద్రఖని, ఇప్పుడు నటుడిగా కూడా అన్ని భాషల ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నారు. ‘అల వైకుంఠపురములో’, ‘క్రాక్’ నుంచి మొదలు పెడితే ‘హనుమాన్’ వరకు ప్రతి సినిమాలోనూ తాను ధరించిన పాత్రలకు నూటికి నూరు శాతం న్యాయం చేశారు. తాను ధరించిన పాత్రల ద్వారా తెలుగువారికి చేరువైన సముద్రఖని ఇప్పుడు ‘మిస్టర్ మాణిక్యం’ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సముద్రఖని ప్రధాన పాత్రలో నంద పెరియసామి దర్శకత్వంలో జీపీ రేఖా…