MR. Manikyam: ‘మిస్టర్ మాణిక్యం’గా సముద్రఖని.. ఆసక్తికరంగా ఫస్ట్ లుక్
- 'మిస్టర్ మాణిక్యం'గా సముద్రఖని
- 'మిస్టర్ మాణిక్యం' ఫస్ట్ లుక్ & రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల
- 'మిస్టర్ మాణిక్యం' ఫస్ట్ లుక్ విడుదల చేసిన సునీల్ నారంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సముద్రఖని, ఇప్పుడు నటుడిగా కూడా అన్ని భాషల ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నారు. ‘అల వైకుంఠపురములో’, ‘క్రాక్’ నుంచి మొదలు పెడితే ‘హనుమాన్’ వరకు ప్రతి సినిమాలోనూ తాను ధరించిన పాత్రలకు నూటికి నూరు శాతం న్యాయం చేశారు. తాను ధరించిన పాత్రల ద్వారా తెలుగువారికి చేరువైన సముద్రఖని ఇప్పుడు ‘మిస్టర్ మాణిక్యం’ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సముద్రఖని ప్రధాన పాత్రలో నంద పెరియసామి దర్శకత్వంలో జీపీ రేఖా రవి కుమార్, చింతా గోపాలకృష్ణా రెడ్డి, రాజా సెంథిల్ ఈ ‘మిస్టర్ మాణిక్యం’ చిత్రాన్ని నిర్మించారు. ‘సీతారామం’ ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చారు.
AR Rahman: నిన్న రెహమాన్.. నేడు సైరా భాను!
Also Read
డిసెంబర్ 28న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఏషియన్ సునీల్ నారంగ్ చేతుల మీదుగా సినిమా ఫస్ట్ లుక్ & రిలీజ్ డేట్ పోస్టర్ ఆదివారం నాడు జరిగిన ఒక కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా సముద్రఖని మాట్లాడుతూ ‘‘విమానం తర్వాత నేను ప్రధానపాత్రలో నటించిన సినిమా ఇది. ‘విమానం’ సినిమా నటుడిగా నాకు మంచి పేరు తెచ్చింది. ‘మిస్టర్ మాణిక్యం’ సినిమా అంతకు మించిన మంచి పేరు తెస్తుందన్న నమ్మకం వుంది. మానవతా విలువలు ప్రధానాంశంగా రూపొందిన సినిమా ఇది. ప్రతి ఒక్కరి మనసులను హత్తుకునే అనేక అంశాలు ‘మిస్టర్ మాణిక్యం’లో వున్నాయి. కుటుంబంతో సహా థియేటర్లకు వచ్చి చూసేంత క్లీన్ కంటెంట్ వున్న సినిమా ఇది. ఈ విషయంలో ప్రేక్షకులకు నా తరఫున పూర్తి భరోసా ఇస్తున్నాను. కుటుంబ సమేతంగా మా సినిమా చూడటానికి రండి’’ అన్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!