40 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న కొవ్వూరు - భద్రాచలం రైల్వే ప్రాజెక్ట్ మరోసారి తెరపైకి వచ్చింది. రైల్వే సమస్యలపై సికింద్రాబాద్ లోని రైల్వే జీఎం శ్రీవాస్తవతో రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి భేటీ అయిన సందర్భంగా ఈ ప్రాజెక్టుపై ఆరా తీశారు. సర్వే జరిగినప్పటికీ పనులు పూర్తవ్వలేదన్న విషయాన్ని ఎంపీ ప్రస్తావించారు.
Purandeswari: కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ కు భారతీయ జనతా పార్టీ పురంధేశ్వరి లేఖ రాశారు. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గంలో ఎర్ర కాలువ పునరుద్ధరణకు 268.5 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరారు. నల్లజెర్ల, దేవరపల్లి మధ్య 6 కిలోమీటర్ల నిడివిలో కుడి, ఎడమ గట్టుల శాశ్వత పునరుద్ధరణకు రూ. 72 కోట్లు ఇవ్వాలన్నారు.
కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఎంపీ పురంధేశ్వరిని నియమించారు.. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ( సీపీఏ) ఇండియా రీజియన్ ప్రతినిధిగా.. కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ సభ్యురాలిగా నామినేట్ అయ్యారు పురంధేశ్వరి.. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
కొల్లం గంగిరెడ్డి వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు.. కొల్లం గంగిరెడ్డి బీజేపీలో చేరుతున్నారు అనేది ప్రచారం మాత్రమేనన్న ఆమె.. ఆ జిల్లా కార్యవర్గంతో మాట్లాడి.. జిల్లా నాయకత్వం సమ్మతిస్తేనే పార్టీలోకి తీసుకుంటాం.. ఆ జిల్లా నాయకత్వం చర్చలు జరుపుతుందేమో చూడాలన్నారు.
MP Purandeswari: రాజమండ్రి- మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని మాజీ ఎంపీ మురళీమోహన్ తో కలిసి రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. హైవేలపై మరమ్మత్తులు త్వరలోనే ప్రారంభమవుతాయని వెల్లడించారు.