కరీంనగర్ జిల్లాలో ఫ్లెక్సీల వివాదం చోటు చేసుకుంది. కార్పొరేషన్ అధికారులకు బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు పార్టీ శ్రేణులు. అయితే నిబంధనలకు విరుద్దంగా ఫ్లెక్సీలను కట్టారని అధికారులు తొలగించారు. దాంతో ఆ సమయంలో వారిని అడ్డుకోని వాగ్వాదానికి దిగిన బీజేపీ నాయకులు… మా ఫ్లెక్సీలు ఎలా తొలగిస్తారంటూ అధికారులను ప్రశ్నించారు. ఆ సమయంలో బీజేపీ శ్రేణులు-అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.