తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ ముగింపు కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను ఎర్రటి ఎండలో బండి సంజయ్ పాదయాత్ర చేశారని, పాదయాత్ర లో ప్రజలను జాగృతం చేశారన్నారు. రాబోయే కాలంలో ఈ గడ్డపై ఎగిరేది కాషాయ జెండానేనని, ప్రజా సంగ్రామ యాత్ర అన్ని ప్రాంతాల్లో జనాలను…
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు నేపథ్యంలో మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ… బండి సంజయ్ ప్రారంభించిన ఈ ప్రజా సంగ్రామ యాత్ర ఎవరినో ముఖ్యమంత్రిని చేయడానికో, బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికో కాదు.. తెలంగాణలో ఉన్న.. దళితులు, రైతులు, బడుగు బలహీన వర్గాలు, యువత అభ్యున్నతి కోసం అని ఆయన వ్యాఖ్యానించారు.…
నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ మండలం దేవక్కపేట్ గోనుగొప్పుల గ్రామాల్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు అమలు చేయాలని బండి సంజయ్ అమిత్ షా ను అడగాలన్నారు. పాదయాత్రలో కర్ణాటక ప్రజలు తెలంగాణ సంక్షేమ కార్యక్రమాలు కావాలని బండికి వినతి పత్రం ఇచ్చారు. నిజం కాదా..? అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా మీటింగ్…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ మంత్రి కేటీఆర్ తన న్యాయవాదితో బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేశారు. దీనిపై బండి సంజయ్ స్పందిస్తూ… కేటీఆర్.. నీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు.. దమ్ముంటే సీబీఐ విచారణకు సిద్దపడు అంటూ సవాల్ విసిరారు. తాను ప్రజల తరపున పోరాడుతున్నానని, వాస్తవాలే మాట్లాడుతున్నానని బండి సంజయ్ స్పష్టం చేశారు. లీగల్ నోటీసుల పేరుతో కేసీఆర్, కేటీఆర్ లు చేసే తాటాకు చప్పళ్లకు…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ ఈ నెల 14న మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడాలో భారీగా నిర్వహించనున్నారు. అంతేకాకుండా ఈ భారీ బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ఈ నేపథ్యంలో… బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ శ్రేణులు.. సభను విజయవంతం చేసేందుకు జిల్లాల వారీగా జనసమీకరణ చేస్తున్నాయి. ఇటీవలే కార్యకర్త…
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ పాదయాత్ర ముగింపు సభను తెలంగాణ బీజేపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నెల 14న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సభకు కేంద హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ఈ నేపథ్యంలో బహరింగ సభకు భారీ జన సమీకరణతో సత్తా…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయి ధ్వజమెత్తారు. బీజేపీ నాయకులు సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారని శ్రీనివాస్ గౌడ్ అగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ తీర్మానం ద్వారా తెలంగాణ ఎందుకు ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. కళ్ళకు గంతలు కట్టుకుని తిరుగుతున్నారా? 30 వేల మంది కర్నూలు, ఇతర ప్రాంతాల నుంచి వలస వస్తున్నారని ఆయన మండిపడ్డారు. పిచ్చోడిలా బీజేపీ నేతలు తిరుగుతున్నారని, చేతగాక వ్యక్తిగత విషయాలను మాట్లాడుతున్నారన్నారు. బహిరంగ సభలో…
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన రెండో దశ ప్రజాసంగ్రామ యాత్ర నేడు 22వ రోజుకు చేరుకుంది. అయితే.. ఈ రోజు మహబూబ్‌నగర్ జిల్లాలోని బండమీదిపల్లి, వన్ టౌన్ మీదుగా జిల్లా కేంద్రంలో ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగనుంది. బండి సంజయ్.. 200 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో నేడు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ జాతీయ…
రెండో దశ ప్రజా సంగ్రామ యాత్రలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. దేశంలో ఎక్కడా లేనటువంటి సమస్యను తెలంగాణలో కేసీఆర్ సృష్టిస్తున్నాడని, నష్టపోయిన రైతన్నలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు. తూతూ మంత్రంగా చర్యలతో తప్పించుకుంటాం అంటే.. వదిలే ప్రసక్తే లేదని, కమిటీలు, నివేదికల పేరుతో కాలయాపన చేస్తే ఊరుకోమని ఆయన వ్యాఖ్యానించారు. నీ దుష్ట, మూర్ఖపు, నీచమైన పాలనలో ఈ ఏడేళ్లలో ఏనాడు రైతన్నను ఆదుకోలేదని, రాష్ట్ర…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. పాలమూరు ఎడారిగా మారిందని ఆయన అన్నారు. కేసీఆర్ ఇక్కడ ఎంపీగా ఉన్న పాలమూరుకు చేసింది శూన్యమన్నారు. జిల్లాను సస్యశ్యామలం చేస్తానన్న కేసీఆర్ మాటలు మాటలుగానే ఉండిపోయాయన్నారు. పాలమూరు ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు, వారి కష్టాలను తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తున్నామన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు బీజేపీతోనే సాధ్యమన్నారు. రేపు జేపీ నడ్డా వస్తున్నారని,…