MP Balram Naik: ములుగు జిల్లాలో జరిగిన ఇంద్ర మహిళ పట్టాల పంపిణీ కార్యక్రమం సభ రాజకీయ వ్యాఖ్యలతో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు, ములుగు ఎంపీ బలరాం నాయక్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతూ.. ములుగు జిల్లాలోని నా పరిధిలో ఉన్న రెండు మండలాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత సీతక్కదే అని స్పష్టం చేశారు.…
బీఆర్ఎస్ హయాంలో మహబూబాబాద్‌లో గిరిజనుల నుంచి బలవంతంగా లాక్కున్న భూములను వారికి తిరిగి ఇచ్చిన తర్వాతనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహబూబాబాద్‌కు రావాలని ఎంపీ బలరాంనాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. లగచర్ల ఘటన బీఆర్ఎస్ పార్టీ కుట్రతో చేయించిందని.. అందులో ఏడుగురికి భూములు లేవని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని దుయ్యబట్టారు.