ఏపీలో సినిమా టికెట్ల ధరల అంశం ఇంకా సర్థుమనగడం లేదు. అయితే తాజాగా ఏపీ టికెట్ల ధరలపై సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. కన్జ్యూమర్ రైట్స్ ప్రొటక్షన్‌కు కూడా ఫోరం ఉందని ఆయన అన్నారు. ప్రోమోలు రిలీజ్ చేసి బ్రహ్మాండంగా ఉందని చెబుతున్నారు. సినిమాటోగ్రఫీ చట్టం ఒకటి ఉందని, రేట్లు, సమయాలు కంట్రోల్ చేయాలని ఉందనే విషయం తెలుసా అని ఆయన ప్రశ్నించారు.
జగనో, నేనో వచ్చాక పెట్టిన నిబంధనలు కావని, సినిమా రేట్లు ఫిక్స్ చేయడమనేది మేమొక్కరమే కాదు గత ప్రభుత్వాలు కూడా చేశాయని ఆయన వెల్లడించారు. శాటిలైట్స్ రైట్స్, ఓటీటీలో అమ్ముకుంటే దాంట్లో ప్రభుత్వానికి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.