టీఎస్‌లో పెరిగిన టిక్కెట్ రేట్లతో చిన్న సినిమాలకు అన్యాయం: నట్టి కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల తెలంగాణలో సినిమా టికెట్ రేట్లను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెల్సిందే. అయితే దీనిపై టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 21న తెలంగాణ సర్కారు సినిమా టికెట్ రేట్లు పెంచుతూ జీవో నెం.120 తీసుకువచ్చిందని, అయితే ఇది చిన్న నిర్మాతలను పూర్తిగా నిరాశపరిచిందని వెల్లడించారు. పెద్ద సినిమాకు, చిన్న సినిమాకు ఒకే విధంగా టికెట్ రేట్లు ఉంటే చిన్న సినిమా బతికి బట్టకట్టేదెలా అని నట్టి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న సినిమాలకు లబ్ది చేకూరేలా సినిమా టికెట్ ధరలపై 10 రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే హైకోర్టును ఆశ్రయిస్తానని నట్టి కుమార్ స్పష్టం చేశారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవోలో సినిమాటోగ్రఫీ యాక్ట్ రూల్స్ లేవని చెప్పాడు. టిక్కెట్ రేట్లను కనీసం రూ.50గా నిర్ణయించాలన్నాడు. తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాల్లో థియేటర్లు సునీల్ నారంగ్, దిల్ రాజు చేతుల్లో ఉన్నాయని, ప్రభుత్వ తాజా నిర్ణయంతో వాళ్లిద్దరికే మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ధరల పెరుగుదల వల్ల మల్టీప్లెక్స్‌లో సామాన్యుడు సినిమా చూసే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇద్దరూ పేదల పక్షపాతిగా గుర్తింపు పొందినవారేనని, అయితే సినిమా టికెట్ల అంశంలో వారు ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నారో తెలియడం లేదని అభిప్రాయ పడ్డారు.
Also Read
- Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
- Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్‌కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
- Jagadish Reddy: సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కౌంటర్
- Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..