TFPC Key Meeting: తమిళ నిర్మాతల మండలి కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంది. కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై తమిళ నిర్మాతల మండలి ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఆయా అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు వెల్లడించింది. అగ్రకథానాయకులు నటించిన ఏ సినిమా అయినా, విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్‌కు తీసుకురావాలని నిర్ణయించింది. ఆగస్టు 16వ తేదీ తర్వాత కొత్త సినిమాల షూటింగ్ మొదలుపెట్టకూడదని తెలిపింది. ప్రస్తుతం షూటింగ్ ఉన్న చిత్రాలన్నీ అక్టోబర్ 31 లోగా పూర్తి చేయాలని సూచించింది. నవంబర్ 1వ తేదీ నుంచి ఎలాంటి షూటింగ్స్ చేపట్టకూడదని వెల్లడించింది. ఈ సమావేశంలో తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్స్, తమిళనాడు థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్స్, తమిళనాడు థియేటర్ మల్టీప్లెక్స్ ఓనర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్స్, తమిళనాడు ఫిల్మ్ డిస్టిబ్యూటర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్స్ పాల్గొన్నారు.
తమిళ హీరోలు వర్సెస్ తమిళ నిర్మాతల మండలి మధ్య వార్ పీక్స్‌కిచేరింది. హీరోలతో వరుసగా వివాదాల నేపథ్యంలో తమిళ నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో అడ్వాన్స్‌లు తీసుకుని సినిమాలు పూర్తి చేయకుండా ధనుష్‌కు చెక్‌పెట్టింది తమిళ నిర్మాతల మండలి. హీరో ధనుష్‌తో సినిమా చేయాలంటే నిర్మాతల మండలి అనుమతి తప్పనిసరి చేస్తూనే ఆగస్టు 15 తర్వాత ఏ కొత్త సినిమా మొదలు పెట్టకూడదని నిర్ణయించింది. ధనుష్‌పై వేటు వేసిన నేపథ్యంలో అదే దారిలో ఉన్న శంభు.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాల్ పైనా త్వరలో చర్యలు తీసుకునే అవకాశం అనే చర్చ తమిళ పరిశ్రమలో హాట్‌గా మారింది. ఇక సినిమా విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీలోకి రావాలని నిర్ణయంతో పాటు కోలీవుడ్‌లో సమస్యలపై జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయబోతోంది.
Read Also: Nandamuri Mokshagna: నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్?
తమిళ నిర్మాతల మండలి భేటీలో కీలక నిర్ణయాలు
*అగ్ర కథానాయకులు నటించిన సినిమాలు థియేటర్లలో విడుదల చేసిన ఎనిమిది వారాల తర్వాత మాత్రమే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ చేయాలి.
*ఇటీవల నటీనటులు, సాంకేతిక నిపుణులు నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్సులు తీసుకొని ఇతర చిత్రాలకు వెళ్లడం వల్ల నిర్మాతలు భారీగా నష్టపోతున్నారు. నిర్మాతల నుంచి అడ్వాన్స్ తీసుకున్న నటుడు, టెక్నీషియన్లు వారి సినిమా పూర్తయిన తర్వాత మరో సినిమాకు పని చేయాలి. హీరో ధనుష్ విషయంలో ఇదే జరిగింది. ఆయనకు వివిధ చిత్ర నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్స్‌లు వెళ్లాయి.
*అనేక తమిళ సినిమాలు సరైన థియేటర్లు దొరకక నష్టాల్లో కూరుకుపోతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి తమిళ నిర్మాతల మండలి కొత్త నిబంధనలను ఆమోదించడానికి సిద్ధంగా ఉంది. అందుకే ఆగస్ట్ 16 నుంచి కొత్త సినిమాల షూటింగ్‌లు ప్రారంభించకూడదు.ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న చిత్రాలు అక్టోబర్ 31 నాటికి పూర్తి కావాలి. నిర్మాణ సంస్థలు ఈ చిత్ర షూటింగ్ వివరాలను తమిళ నిర్మాతల మండలికి అందించాలి.
*నటులు, సాంకేతిక నిఫుణుల జీతాలు, ఇతర ఖర్చులు అదుపులేకుండా పెరిగిపోతున్నందున ఆ ఖర్చులను క్రమబద్దీకరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే నవంబర్ 1 నుంచి తమిళ సినిమాకు సంబంధించిన అన్ని రకాల షూటింగ్‌లను నిలిపివేయాలని తమిళ నిర్మాతల మండలి ప్రతిపాదించింది.
*కోలివుడ్‌కు సంబంధించిన సమస్యల పరిష్కారానికి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులతో కూడిన జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.