ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా విడుదలై మంచి హిట్ సాధించడం, పుష్ప-2 సినిమాకు కాస్త టైం దొరకడంతో ఫ్యామిలీతో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే బన్నీ ఒకవైపు సినిమాలతో పాటు ఫ్యామిలీ లైఫ్‌ను కూడా బ్యాలెన్స్ చేస్తున్నాడు. స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న బన్నీ ఇప్పటికీ అంతే ప్రేమగా ఫ్యామిలీ కోసం సమయం కేటాయిస్తున్నాడు. 2011 మార్చి 6వ తేదీన అల్లు అర్జున్-స్నేహారెడ్డి వివాహం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. నేటికి వీరి వివాహం జరిగి 11 ఏళ్లు పూర్తవుతున్నాయి.
ఈ సందర్భంగా బన్నీ భార్య స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో క్యూట్ పిక్ షేర్ చేసింది. ఈ ఫోటోలో భార్య స్నేహారెడ్డి, పిల్లలు అల్లు అయాన్, అర్హలతో కలిసి బన్నీ సంబరాలు చేసుకుంటూ కనిపించాడు. తన భార్య స్నేహాతో వివాహ బంధం నేటితో 11 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో కేక్ కట్ చేసి ఎంతో ఆనందంగా సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఈ ఫోటో చూసి అల్లు అర్జున్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా పుష్ప ది రూల్ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. సుకుమార్ ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. పుష్ప సెకండ్ పార్టులో మరిన్ని ఆకర్షణలు ఉంటాయని టాక్ నడుస్తోంది.