Game Changer : మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ థియేటర్లో రిలీజ్ అయింది. మావెరిక్ దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని సాలిడ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కించారు.
టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస చిత్రలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక “సలార్” నిర్మాణ సంస్థ ‘హోంబళే’ ప్రభాస్ తో ఏకంగా మూడు భారీ సినిమాలు లాక్ చేయగా, రీసెంట్ స్ట్రాంగ్ బజ్ ఒకటి వినపడుతుంది.. అది ఏంటంటే.. కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో కూడా రెబల్ స్టార్ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియనప్పటికీ.. ప్రజంట్ రివిల్ అయిన ప్రభాస్ లుక్ లల్లో దర్శకుడు…
అదేంటి నాన్న సినిమాకి పోటీగా శంకర్ కూతురు రావడం ఏంటి అని షాక్ అవుతున్నారా? అయితే ఈ స్టోరీ మీరు చూడాల్సిందే. 2025లో తమిళనాడులో పొంగల్‌కు కేవలం మూడు చిత్రాలు మాత్రమే విడుదల కావాల్సి ఉంది. అజిత్ విదాముయార్చి, బాల వనగన్, శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్. అయితే చివరి క్షణంలో పొంగల్ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు విదాముయార్చి చిత్రబృందం నిన్న ప్రకటించింది.
కిచ్చా సుదీప్ కన్నడ స్టార్ హీరో. రాజమౌళి పుణ్యమా అని తెలుగులో కూడా మంచి ఫేమస్ అయ్యాడు. ఈ మధ్య ఆయన చేస్తున్న కన్నడ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ‘విక్రాంత్ రోణ’ తర్వాత కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ పూర్తి స్థాయి హీరోగా నటించిన ‘మ్యాక్స్’ సినిమా కన్నడనాట సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. వెర్సటైల్ ఆర్టిస్ట్ వరలక్ష్మీ శరత్ కుమార్, పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన టాలీవుడ్ నటుడు సునీల్ కీలక…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అభిమానులపై అసహనం వ్యక్తం చేశారు. ఈ రోజు కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించడానికి వెళ్లిన సంగతి తెలిసిందే.
Rajinikanth Birthday: తెలుగు చిత్రసీమతో మొదటి నుంచీ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు అనుబంధం ఉంది. రజనీకాంత్ చిత్రసీమలో అడుగుపెట్టక ముందు బెంగళూరులో సిటీ బస్ కండక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ప్రతి రోజూ సెకండ్ షో చూడడం ఆయనకు అలవాటుగా ఉండేదట. అప్పట్లో రజనీకాంత్ ఎక్కువగా ఎన్టీఆర్ సినిమాలనే సెకండ్ షోస్ లో చూసేవారు. ఎన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రాలంటే రజనీకాంత్‌కు ఎంతో ఇష్టం. ఎన్టీఆర్ ‘శ్రీకృష్ణ పాండవీయం’ చిత్రాన్ని బెంగళూరులో పలు మార్లు చూశానని…
కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టుగా.. ఇండియాస్ హైయెస్ట్ ఓపెనింగ్స్‌తో పాటు.. హైయెస్ట్ కలెక్షన్స్‌ను టార్గెట్ చేశారు సుకుమార్, అల్లు అర్జున్. పుష్ప సినిమాకు వచ్చిన క్రేజ్ చూసి.. పుష్ప 2ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకోసం మూడేళ్ల సమయం తీసుకున్నారు. అందుకు తగ్గట్టే.. సాలిడ్ అవుట్ పుట్ వచ్చినట్టుగా చిత్ర యూనిట్ హైప్ ఎక్కించింది. సినిమా రన్ టైం మూడు గంటల 20 నిమిషాలు ఉన్నా సరే.. అరె అప్పుడే అయిపోయిందా? అనేలా ఉంటుంది అని ప్రూవ్…
Priyanka Jain: తిరుమల శ్రీవారి భక్తులకు, టీటీడీకి క్షమాపణలు చెప్తూ బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ ఆమె బాయ్ ఫ్రెండ్ శివ్ కుమార్ వీడియో విడుదల చేశారు. సరదా కోసం చేసిన వీడియో ద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఊహించలేదు.
This Week OTT Movies: దసరా పండుగ అయిపోయింది. హడావుడి కాస్త తగ్గింది. పండుగ నిమిత్తం సొంతూళ్లకు వెళ్లిన వాళ్లందరూ తిరిగి పనుల్లో బిజీ అయిపోయారు. ఇక పండగ సందర్భంగా థియేటర్లలో అరడజనుకు పైగా సినిమాలు రిలీజయ్యాయి.
సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి, కార్డియాక్ అరెస్ట్‌తో ప్రాణాలు కోల్పోయింది. శుక్రవారం సాయంత్రం గాయత్రికి ఈ ఆరోగ్య సమస్య రావడంతో, హైదరాబాదులోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే శనివారం మరణించింది. ఈ సంఘటనతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. గాయత్రి భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలోని ఇంటికి తీసుకువచ్చారు. రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు…