VeerasimhaReddy: అఖండ తర్వాత నందమూరి బాలకృష్ణ నటించిన సినిమా వీరసింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా భారీ ఎత్తున విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఈనెల 6న ఒంగోలులోని ఏబీఎం గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని తలపెట్టారు. కానీ తాజాగా ఏపీ పోలీసులు వీరసింహారెడ్డి చిత్ర యూనిట్‌కు షాక్ ఇచ్చారు. ఈ వేడుకకు అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని.. అభిమానుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని వేదిక మార్చుకోవాలని పోలీసులు…
45 Years Of Sati Savitri: కొన్ని సినిమాల్లో కథానుగుణంగా కొందరు నటీనటులు వేసిన చిన్న వేషాలే, తరువాతి రోజుల్లో సదరు నటులతోనే పూర్తి స్థాయిలో చిత్రాలుగా రూపొందిన సంఘటనలు తెలుగు చిత్రసీమలో చోటు చేసుకున్నాయి. అలా మహానటుడు నటరత్న యన్.టి.రామారావు నటజీవితంలో కొన్ని పాత్రలు మొదట బిట్ రోల్స్ లో కనిపించి, తరువాత పూర్తి స్థాయిలో అలరించిన సందర్భాలున్నాయి. ఆయన శ్రీరామునిగా తెరపై కనిపించిన తొలి చిత్రం ‘చరణదాసి’. అందులో ఓ డ్రీమ్ సాంగ్ లో…
Supreme Court: థియేటర్లలోకి బయటి ఫుడ్ తీసుకెళ్లే విషయంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రేక్షకులు థియేటర్లకు బయటి ఫుడ్ తీసుకురావడంపై యాజమాన్యాలు ఆంక్షలు పెట్టడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. థియేటర్లు ప్రైవేట్ ప్రాపర్టీ కావడం పట్ల యాజమాన్యం నిబంధనలు పెట్టుకోవచ్చని కోర్టు సూచించింది. శిశువుల కోసం తల్లిదండ్రులు తీసుకెళ్లే ఆహారంపై మాత్రం ఎలాంటి ఆంక్షలు పెట్టడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు చీఫ్ జస్టీస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.…
Samaira ka Marriage: కరిష్మా కపూర్ కూతురు సమైరా. వయసు 17. తను ఎయిర్‌పోర్ట్‌లో పాపరాజీ మీడియా కంట్లో పడిపోయింది. తన బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడనే ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయి. ఇప్పటికే సమైరా ప్రజాదరణ పొందిన స్టార్ కిడ్స్‌లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. కష్మా, మాజీ భర్త సంజయ్ కపూర్ జంటకి సమైరా, కియాన్ రాజ్ కపూర్ అనే ఇద్దరు పిల్లలు. కరిష్మాకి ఇన్‌స్టాగ్రామ్‌లో 7 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవల ముంబై ఎయిర్‌పోర్ట్‌లో క్యాజువల్స్‌లో…
ఆమంచి వెంకటసుబ్రహ్మణ్యం అంటే ఎవరికీ అంతగా తెలియదు కానీ, ఏవీయస్ అనగానే చప్పున జనం 'తుత్తి ఏవీయస్' అనేస్తారు. బాపు తెరకెక్కించిన 'మిస్టర్ పెళ్ళాం'లో 'తుత్తి' అంటూ ఏవీయస్ పంచిన వినోదం ఈ నాటికీ ఆ సినిమాచూసిన జనానికి కితకితలు పెడుతూనే ఉంది.
తెలుగు చలనచిత్ర సీమలో 'భరణీ పిక్చర్స్' సంస్థకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. మహానటి భానుమతి, ఆమె భర్త దర్శకనిర్మాత పి.రామకృష్ణ ఈ సంస్థను నెలకొల్పారు. బహుముఖ ప్రతిభాపాటవాలకే కాకుండా, సాహసానికీ మారుపేరుగా నిలిచారు భానుమతి.
వెండితెర కథానాయకుడిగా, ప్రజా నాయకుడిగా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు. సినిమా నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా సినిమా రంగంపై ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాప్ హిట్ 'ఖుషి' చిత్రాన్ని డిసెంబర్ 31న 2022కి వీడ్కోలు పలుకుతూ, 2023కి సుస్వాగతం చెబుతూ విడుదల చేశారు. పవన్ అభిమానులకు ప్రస్తుతం 'ఖుషి' ఆనందం పంచుతోంది. సరిగా పాతికేళ్ళ క్రితం అంటే 1998లో జనవరి 1వ తేదీనే పవన్ కళ్యాణ్ ఆ యేడాదికి 'సుస్వాగతం' పలుకుతున్నట్టుగా అదే టైటిల్ తో రూపొందిన తన చిత్రాన్ని విడుదల చేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో న్యూ ఇయర్ గిఫ్ట్ లభించనుంది. ఇప్పటికే 2023 కానుకగా పవన్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ 'ఖుషి' డిసెంబర్ చివరిరోజున జనాన్ని పలకరించింది. 'ఖుషి' చిత్రాన్ని చూడటానికి తెలుగు రాష్ట్రాల్లో పవన్ ఫ్యాన్స్ థియేటర్లకు పరుగులు తీస్తున్నారు.
Unstoppable 2: భారతీయ చలనచిత్ర కీర్తి కిరీటానికి ‘తెలుగు పింఛం’… ప్రాంతీయ చలన చిత్రాల ప్రపంచవ్యాప్త సన్మానానికి అతని అడుగు శ్రీకారం… పెద్దమనసు తనానికి నిలువెత్తు ఖనిజం… చిరునవ్వుతో లోకాన్ని గెలవగలిగే రాజసం అతని నైజం… అవును నిజం… ప్రభాస్ అతని నామధేయం.. అంటూ బాహుబలి స్టార్ ను బాలకృష్ణ ఆహ్వానించడం ‘ఆహా’లో ‘అన్ స్టాపబుల్’ సెకండ్ సీజన్‌కు ఓ కళ తెచ్చిందని చెప్పవచ్చు. అదీగాక, ప్రభాస్ తో బాలయ్య టాక్ షో రెండు ఎపిసోడ్స్ గా…