అమెరికాలోని టెక్సాస్‌లో దారుణమైన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సవన్నా క్రీగర్ అనే 32 ఏళ్ల మహిళ తన 3 ఏళ్ల కుమారుడిని కాల్చి చంపి, ఆ తర్వాత తుపాకీతో తనకు తాను కాల్చుకుంది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయే ముందు తల్లి ఫోన్లో భయంకరమైన వీడియోను రికార్డు చేసింది. 'మీ తండ్రికి వీడ్కోలు చెప్పు' అంటూ వీడియోలో రికార్డైంది.
మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ తల్లి లక్ష్మీ అనారోగ్యంతో కన్నుమూశారు. హన్మకొండలో ఓ ప్రయివేట్ చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మృతి చెందింది. బలరాం నాయక్ స్వస్థలం ములుగు జిల్లా మదనపల్లి గ్రామం. బలరాం నాయక్.. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫున పోటీ చేస్తున్నారు. మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేస్తున్నారు. కాగా.. గతంలో బలరాం నాయక్ కేంద్రమంత్రిగా పని చేశారు. 2012 అక్టోబరులో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో…
ఏడాదికి ఒకసారి వచ్చే పుట్టినరోజు వేడుకలను చాలామంది ఘనంగా జరుపుకుంటారు. ఇక ఇంట్లో వారి పుట్టినరోజు వేడుకలను చాలా స్పెషల్ గా జరుపుకుంటారు కుటుంబ సభ్యులు. ముఖ్యంగా పిల్లల విషయంలో పెద్దలు గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేయడానికి ఇష్టపడతారు. ఇకపోతే తాజాగా ఓ బుడ్డోడు తన తల్లి పుట్టిన రోజును ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయాలనుకున్నాడు. అందుకు గాను ఏకంగా విమాన సిబ్బంది సాయం కోరాడు ఆ బుడ్డోడు. ఇక ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..…
చైల్డ్ కేర్ లీవ్‌పై సుప్రీం కోర్టు వికలాంగ పిల్లల సంరక్షణకు సెలవు ఇవ్వకపోవడాన్ని సుప్రీంకోర్టు తీవ్రమైన అంశంగా పరిగణించింది. వికలాంగ బిడ్డను చూసుకునే తల్లికి శిశు సంరక్షణ సెలవును నిరాకరించడం శ్రామికశక్తిలో మహిళల సమాన భాగస్వామ్యాన్ని నిర్ధారించే రాష్ట్ర రాజ్యాంగ విధిని ఉల్లంఘించడమేనని సోమవారం పేర్కొంది.
రాను రాను మనుషులలో కొంత క్రూరత్వం మరింతగా పెరిగిపోతుంది. భూమ్మీద ఎలాంటి స్వార్థం కాకుండా ఒక మనిషిని ప్రేమించగలగేది వారి తల్లి మాత్రం ఒక్కటే అని సులువుగా చెప్పవచ్చు. తల్లికి తన భర్త తోడు ఉన్న లేకున్నా తన పిల్లల్ని మాత్రం ఎంతో బాధ్యతగా పెంచి వారిని ప్రయోజకులను చేస్తుంది. కన్నతల్లి చూపించే ప్రేమ ముందర ఎన్ని కపట ప్రేమలు వచ్చిన తక్కువే. అయితే తల్లి అంత ప్రేమ చూపించిన వారి పుత్రులు మాత్రం ఆమెపై అదే…
మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడి కోసం కన్న కొడుకు, కూతురును కడతేర్చింది ఓ తల్లి. ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు పిల్లలు అడ్డుకుంటున్నారని.. ఈ క్రమంలో 5 ఏళ్ల బాలిక, 3 ఏళ్ల బాలుడును కొట్టి చంపింది. ఈ ఘటన రాయ్‌గఢ్ జిల్లాలో జరిగింది. కాగా.. ఈ ఘటనపై నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రియుడితో పెళ్లి చేసుకుందామని, పిల్లలు అడ్డుకుంటున్నారని యువతి పోలీసులకు తెలిపింది. ఈ మేరకు బుధవారం పోలీసులు సమాచారం అందించారు.
ఈ భూప్రపంచంలో అమ్మను మించిన దైవం లేదు.. నవ మోసాలు మోసి కని పెంచిన కన్నతల్లికి ప్రేమను పంచాలి.. మన సంతోషంలో తన సంతోషాన్ని వెతుక్కుంటుంది.. అందుకే అమ్మను గౌరవించడం, చివరి రోజుల్లో పసిపాపలాగా చూసుకోవడం మన భాధ్యత.. కానీ ఈరోజుల్లో వయసు పైబడిన తల్లి దండ్రులను వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నారు.. కొందరు అయితే రోడ్ల మీదకు వదిలేస్తున్నారు.. కానీ ఓ స్టార్ హీరో తనకు ఇష్టమైన తల్లికి ఏకంగా గుడి కట్టించాడు. అందుకు సంబందించిన ఫోటోలు కూడా…