ఏడాదికి ఒకసారి వచ్చే పుట్టినరోజు వేడుకలను చాలామంది ఘనంగా జరుపుకుంటారు. ఇక ఇంట్లో వారి పుట్టినరోజు వేడుకలను చాలా స్పెషల్ గా జరుపుకుంటారు కుటుంబ సభ్యులు. ముఖ్యంగా పిల్లల విషయంలో పెద్దలు గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేయడానికి ఇష్టపడతారు. ఇకపోతే తాజాగా ఓ బుడ్డోడు తన తల్లి పుట్టిన రోజును ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయాలనుకున్నాడు. అందుకు గాను ఏకంగా విమాన సిబ్బంది సాయం కోరాడు ఆ బుడ్డోడు. ఇక ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Also read: 10th Results: తన మార్క్స్ ను చూసుకొని ఆనందంతో మూర్చబోయిన విద్యార్థి..
తల్లికొడుకు ఇద్దరూ ఓ విమానంలో ప్రయాణం చేస్తున్నారు. మామూలుగా విమాన సంస్థలు ఎక్కువగా ప్రయాణికులకు అభిరుచికి అనుగుణంగా నడుచుకునేందుకు ప్రయత్నం చేసుకుంటాయి. ఈ క్రమంలోనే ఓ బాలుడు అడిగిన విజ్ఞప్తికి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది స్పందించింది. తన తల్లి పుట్టిన రోజు వేడుకను జరిపించి తల్లిని ఆశ్చర్యపచ్చాడు. విమానంలో అనౌన్స్మెంట్ ఇస్తున్న పైలెట్ వద్దకు వెళ్లి ఈరోజు తన తల్లి పుట్టిన రోజు అని తెలుపుతూ.. ఆమెకు ఎలాగైనా శుభాకాంక్షలు స్పెషల్ అనౌన్స్మెంట్ ద్వారా తెలపాలని కోరాడు. అయితే అందుకు అంగీకరించిన ఫ్లైట్ సిబ్బంది ఆ తల్లి కోసం ఓ ప్రత్యేక అనౌన్స్మెంట్ చేసి ఆమెకి విషెస్ తెలుపుతూ.. చేత్తో రాసిన ఓ నోట్ కూడా ఆమెకు అందించారు. అంతేకాదు ఆవిడకు ప్రత్యేకమైన ట్రీట్ కూడా అందించడంతో ఆ తల్లి ముఖం చిరునవ్వుతో వెలిగిపోయింది.
Also read: UK Army: రద్దీ రోడ్లపై ఆగకుండా పరుగులు పెట్టిన ఆర్మీ గుర్రాలు.. వీడియో వైరల్..
విమానంలోని ఇతర ప్రయాణికులు కూడా ఆవిడకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజెన్స్ అబ్బాయి ఆలోచన అమోఘం అంటూ మెచ్చుకుంటున్నారు.