తల్లులు పిల్లలకోసం ఎన్నో కలలు కంటుంటారు. వాళ్లను ఎలా పెంచాలీ... వాళ్లకోసం ఏం చేయాలీ... ఇలా ఎన్నో ఆలోచిస్తుంటారు. చిన్నప్పుడు పిల్లలు వేసే బుడి బుడి అడుగులను చూసి మురిసిపోతుంటారు. బిడ్డకు చిన్న కష్టమొస్తే తల్లి మనసు తల్లడిల్లుతుంది.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో విషాదం నెలకొంది.. తన ఇద్దరు పిల్లలతో కలిసి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది ఓ తల్లి.. ఈ ఘటనలో ముగ్గురూ సజీవదహనం అయ్యారు.. ఈ ఘటనలో రమా (35) తల్లి.. ఇద్దరు పిల్లలు మను (7 ఏళ్ల బాబు), మన్విత (ఐదేళ్ల పాప) ప్రాణాలు విడిచారు..
తమకు పుట్టిన పిల్లల కన్నా వాళ్లకు పుట్టిన పిల్లలనే ఎక్కువ ప్రేమగా చూసుకుంటారు నాయనమ్మలు, అమ్మమ్మలు. మనవళ్లు, మనవరాళ్లను అల్లారు ముద్దుగా, గారాబంగా చూసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం మనవడు అన్న కనికరం లేకుండా అమ్మకానికి పెట్టేసింది. ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెంలో చోటుచేసుకుంది.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని నందిగామ మండలం రంగాపూర్ శివారు దర్గా రోడ్డు మూల మలుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళుతున్న మహిళ, ఇద్దరు బాలురకు తీవ్ర గాయాలై సంఘటన స్థలంలోని మృతి చెందారు. వీరు చంద్రయాన్ గుట్ట వాసులుగా గుర్తించారు. వీరిలో హజరత్ బేగం (35), అబ్దుల్ రహమాన్ (12) సంఘటన స్థలంలోని మృతి చెందినట్లు సానికులు తెలిపారు. రహీం (9) పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు.
వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో 40 రోజుల పసికందు.. ఆమె ఆరేళ్ల సోదరుడు ప్రాణాల కోసం పోరాడుతుండగా.. వారిద్దరినీ రెస్క్యూ టీమ్ సురక్షితంగా రక్షించింది. వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వరదల్లో కొట్టుకుపోయారు. వారి ఇల్లు కూడా ధ్వంసమైంది. అయితే.. ఆ కుటుంబంలో పసికందు అనారా, సోదరుడు మహ్మద్ హయాన్ సురక్షితంగా బయటపడ్డారు.
Mother and Son: తల్లీ కొడుకుల ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ చైతన్య పురి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆర్ధిక సమస్యలతో తల్లి బలవన్మరణం చేసుకోవడంతో..
Viral Video : ఉత్తరాఖండ్లోని రూర్కీలోని ఝబ్రేదాలో ఓ క్రూరమైన తల్లి తన బిడ్డను కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తల్లి కూడా తన బిడ్డను ఇలా ఇంత దారుణంగా కొట్టగలదన్న విషయం ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.
భువనేశ్వర్లో దారుణం జరిగింది. కన్నతల్లి ఎదుటే తండ్రిని హతమార్చాడు కొడుకు. ఆర్థిక తగాదాలే హత్యకు కారణంగా పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసిస్టెంట్ ప్రొఫెసర్ అనిరుధా చౌదరిని అరెస్ట్ చేశారు.
ఇండోనేసియాలో దారుణం జరిగింది. ఓ కొండచిలువ మహిళను చంపేసింది. ఈ దారుణ ఘటన జూలై 2న చోటుచేసుకుంది. భర్త రక్షించే ప్రయత్నం చేసినప్పటికే అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది.
రాజస్థాన్లో విషాదం చోటు చేసుకుంది. నాగౌర్ జిల్లా ఖిన్వ్సర్ ప్రాంతంలోని చరదా గ్రామంలో కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుంది. చెరువులో మునిగి ఒక వివాహిత.. ఆమె ఇద్దరు కూతుళ్లు మృతి చెందారు. సమాచారం అందుకున్న భవంద పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురి మృతదేహాలను వెలికితీసి ఖిన్వసర్లోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకు తరలించారు. మృతులు తల్లి లీల, కూతుళ్లు కనిక, కృష్ణగా గుర్తించారు. అయితే.. లీలా భర్త తనను కొట్టి చిత్రహింసలకు గురిచేస్తున్నాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.