Shocking video: ఓ తల్లి క్రూరత్వం.. కన్న బిడ్డను ఏం చేసిందంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నవమాసాలు మోసి.. కని.. పెంచిన ఓ మాతృమూర్తి.. మృగం కంటే దారుణంగా ప్రవర్తించింది. భర్త మీద కోపమో.. లేదంటే ఇంకెవరి మీద కోపమో తెలియదు గానీ.. ముక్కుపచ్చలారని చిన్న బిడ్డపై ప్రతాపం చూపించింది ఓ కసాయి తల్లి. ఏ కన్నపేగు కూడా ఇంత దారుణంగా చేయదు. అలాంటిది అత్యంత దారుణంగా ప్రవర్తించి అమ్మ అనే పదానికి అర్థం లేకుండా చేసింది. ఈ ఘోరం హర్యానాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
Also Read
- Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్‌లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
- Discount On Mobile: తొలి సేల్‌లో రూ.10,000 తక్కువ ధరకు లభిస్తున్న మోటో 'లగ్జరీ' ఫోన్.. రేపు అందుబాటులోకి..
- Worst Bowling: యువకుడు, ఎత్తుగా ఉన్నాడు, బౌలింగ్ బాగా వేస్తాడు అనుకున్నారు.. కట్ చేస్తే చుక్కలు చూపించారు..
- IND vs ENG 3rd ODI: ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఊచకోత.. లార్డ్స్‌లో 51 ఏళ్ల రికార్డు బద్దలు..

తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో హల్‌చల్ చేస్తోంది. అందులో ఓ తల్లి.. తన బిడ్డను ఇష్టానుసారంగా కొట్టడమే కాకుండా.. మంచంపై విసిరివేసి.. చిన్నారి ఛాతీపై కొన్ని నిమిషాల పాటు అలానే కూర్చుని ఊపిరాడకుండా చేసింది. ఆ పసి ప్రాణం విలవిలలాడిపోయింది. అంతటితో ఆగిందా అంటే.. పదే పదే చెంపదెబ్బలు కొట్టడం.. తన్నడం విజువల్స్‌లో కనిపించాయి. దాడి చేస్తూనే దుర్భాషలాడింది. తండ్రి వచ్చి ఆపే ప్రయత్నం చేసినా అతని మాట ఏ మాత్రం లెక్కచేయలేదు. అంతేకాకుండా బెదిరింపులకు దిగింది. జోక్యం చేసుకుంటే.. బిడ్డకు విషం ఇచ్చి.. తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దీంతో అతడు ఏమి చేయలేక మిన్నకుండిపోయాడు. కానీ ఈ బాగోతాన్ని మాత్రం సీసీ కెమెరాల్లో రికార్డ్ చేశాడు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమె ఒక డాక్టర్ కావడం విశేషం.
ఇక తన భర్త.. తాగుబోతని నిందవేసింది. పైగా అతనిని ఏ మాత్రం లెక్కచేయలేదు. కొంచెం కూడా భయం కనిపించలేదు. దీనిని బట్టి భార్యాభర్తల మధ్య సఖ్యత లేనట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం వీడియో మాత్రం నెట్టింట వైరల్‌గా మారింది. ఇలా పలుమార్లు.. ఆ చిన్నారిపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య దుర్మార్గాన్ని వీడియోలతో సహా సమర్పించాడు. జోక్యం చేసుకుంటే.. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన భార్య క్రూరత్వాన్ని బయటపెట్టేందుకే ప్రతి గదిలో సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేసినట్లు అతడు చెప్పాడు.
ఇక ఈ ఘటనపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) మండిపడింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సిడబ్ల్యుసి) ఆదేశాల మేరకు సూరజ్‌కుండ్ పోలీస్ స్టేషన్‌లో తల్లిపై క్రూరత్వ కేసు నమోదు అయింది. ఎన్నికల విధుల కారణంగా చిన్నారి వాంగ్మూలాన్ని నమోదు చేయలేదని సూరజ్‌కుండ్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ షంషేర్ సింగ్ తెలిపారు.
ఇక ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. నిందితురాలిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ముక్కుపచ్చలారని చిన్నారిపై ప్రతాపం చూపించడమేంటి? అని నిలదీస్తున్నారు.
कलेजे के टुकड़े संग ऐसी हरकत? बच्चे को बेरहमी से पीटने का वीडियो वायरल, पिता ने डॉक्टर मां पर लगाए गंभीर आरोप !!#Faridabad_Crime: इन दिनों एक विडियो वायरल है। एक महिला अपने 11 साल के बेटे को बेरहमी से पीटती दिख रही है। कभी वह बच्चे की छाती के ऊपर बैठकर थप्पड़ मारती है तो कभी… pic.twitter.com/SqWLKVJPt9
— MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) May 27, 2024
తాజావార్తలు
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
-
H-FAST Raids: కల్తీగాళ్ల గుండెల్లో రైళ్లు.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో H-FAST భారీ దాడులు..
-
Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్‌లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
-
Vallabhaneni Anil: టాలీవుడ్లో యూనియన్ వివాదానికి ఫుల్స్టాప్.. జానీ మాస్టర్‌పై నాన్ కోఆపరేషన్ ఎత్తివేత!
-
Discount On Mobile: తొలి సేల్‌లో రూ.10,000 తక్కువ ధరకు లభిస్తున్న మోటో ‘లగ్జరీ’ ఫోన్.. రేపు అందుబాటులోకి..
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!