PM Modi: ప్రచార సభలో భావోద్వేగానికి గురైన మోడీ.. కొద్దిసేపు ప్రసంగం నిలిపివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ మరోసారి ఎమోషనల్‌కు గురయ్యారు. ప్రచార సభలో ఓ కుర్రోడు చూపించిన ఫొటోను చూసి ఉద్వేగానికి గురయ్యారు. దీంతో మోడీ కొంతసేపు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయారు. ఈ సంఘటన శుక్రవారం మధ్యప్రదేశ్ పర్యటనలో చోటుచేసుకుంది.

Also Read
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ ఆయా రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం ఉత్తరప్రదేశ్‌లో పర్యటించిన ఆయన.. అక్కడి నుంచి మధ్యప్రదేశ్ చేరుకున్నారు. దమోహ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడికి ఓ యువకుడు తీసుకొచ్చిన చిత్రాన్ని చూసి మోడీ ఉద్వేగానికి లోనయ్యారు. సభలో మాట్లాడుతుండగా దూరం నుంచి ఓ యువకుడి చేతిలో ఫొటోఫ్రేమ్ కన్పించింది. తన మాతృమూర్తి హీరాబెన్ తనను ఆశీర్వదిస్తున్న ఫొటో అది. పెన్సిల్‌తో గీసిన ఆ చిత్రాన్ని చూసిన మోడీ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. తన తల్లిని గుర్తుచేసుకుని మాటలు రాక ప్రసంగాన్ని కొంతసేపు ఆపేశారు. ఆ తర్వాత చిత్రం తీసుకొచ్చిన యువకుడిని అభినందించారు. ఆ ఫొటో వెనక పేరు, చిరునామా రాసివ్వాలని అతడికి సూచించారు. తాను లేఖ రాస్తానని మోడీ తెలిపారు. ఈ సన్నివేశంతో ఒక్కసారిగా సభకు వచ్చిన కార్యకర్తలంతా ఎమోషనల్‌కు గురయ్యారు.
ఇది కూడా చదవండి: CM YS Jagan: పిఠాపురం ప్రజలు ఆలోచించాలి.. లోకల్ హీరో కావాలా? సినిమా హీరో కావాలా..?
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగుతోంది. తొలి విడత శుక్రవారమే జరిగింది. ఇక సెకండ్ విడత ఏప్రిల్ 26న జరగనుంది. అనంతరం మే 7, 13, 20, 25, జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి. అయితే ఈసారి 400 సీట్లకు పైగా ఎన్డీఏ గెలుచుకుంటుందని మోడీ ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!