Russia School Shooting: రష్యాలో దారుణం జరిగింది. ఓ దుండగుడు స్కూల్ లో విచక్షణారిహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 13 మంది మరణించారు. ఘటన జరిగిన తర్వాత నిందితుడు తనను తాను చంపుకున్నాడు. సెంట్రల్ రష్యాలోని ఇజెవ్స్క్ నగరంలో ఈ ఘటన జరిగింది. నగరంలోని ఓ పాఠశాలలోకి ప్రవేశించి ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మరణించిన 13 మందిలో ఏడుగురు పిల్లలు కూడా ఉన్నట్లు గవర్నర్ అలెగ్జాండర్ బ్రెచలోవ్ వెల్లడించారు.
ఉక్రెయిన్ పై నెలరోజులకు పైగా యుద్దోన్మాదంతో రెచ్చిపోతున్న రష్యా, అనూహ్యంగా ఒక కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ పై వార్‌లో తొలి దశ ముగిసిందని తెలిపింది. ఇక తూర్పు డాన్ బాస్ ప్రాంతాలపై దృష్టిసారిస్తామని రష్యన్ మిలటరీ ప్రకటించింది. డొంటెస్క్, లుహాంస్క్ లలో రష్యా అనుకూల తిరుగుబాటు దారుల ప్రభుత్వాలు పాలిస్తున్నాయి. పూర్తిస్తాయిలో వీటిని ఆక్రమించేందుకు వ్యూహం మార్చింది మాస్కో. ఉక్రెయిన్ ప్రతిఘటనతో విసిరివేసారుతున్న రష్యన్ మిలటరీ, చిన్నచిన్న లక్ష్యాల వైపు అడుగులెయ్యాలని వ్యూహం మారుస్తున్నట్టు కనపడుతోంది.…
రష్యాలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. మరణాల రేటు కూడా పెరిగింది. దాంతో అలర్ట్ అయిన రష్యా ప్రభుత్వం… కఠిన ఆంక్షలు విధించింది. కరోనా కేసులు ఎక్కువగా వస్తున్న మాస్కో సహా మరికొన్ని ప్రాంతాల్లో పాక్షిక లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. దాంతో స్కూళ్లు మూతపడ్డాయి. అత్యవసర, నిత్యవసరాలకు మినహాయింపు ఇచ్చారు. అయితే, పాక్షిక లాక్‌డౌన్ కూడా పూర్తిగా అమలు కావడం లేదు. మెట్రోలాంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టుపై ఎలాంటి ఆంక్షలు లేవు. దాంతో…