Massive Fire in Shopping Mall: షాపింగ్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న అగ్నికీలలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Massive Fire in Shopping Mall: రష్యాలోని ఓ పెద్ద షాపింగ్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో సుమారు ఏడు వేల చదరపు మీటర్ల విస్తీర్ణం మేర మంటలు విస్తరించాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రష్యా క్యాపిటల్ మాస్కో ఉత్తర శివారు ప్రాంతమైన ఖిమ్కిలో ఈ సంఘటన జరిగింది. అక్కడి మెగా ఖిమ్కి షాపింగ్ సెంటర్‌లో శుక్రవారం తెల్లవారుజామున భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఫుట్‌బాల్ క్రీడా మైదానం మేర విస్తీర్ణంలో ఉన్న షాపింగ్ మాల్ అంతటా మంటలు వ్యాపించాయి. కొన్ని పేలుడు శబ్ధాలు కూడా వినిపించినట్లు స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ షాపింగ్ మాల్ భవనంలో ఉంటున్న నివాసితులు, సిబ్బంది అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు.
కాగా, సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది, అగ్నిని నియంత్రణ వాహనాలతో ఫైటర్లు అక్కడకు చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే మంటలు పెట్టి ఉంటారని రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ అనుమానం వ్యక్తం చేసింది. మాస్కోలోని షెరెమెటీవో విమానాశ్రయం నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖిమ్కి, మెగా షాపింగ్ మాల్‌తోపాటు ప్రసిద్ధ ఎంటర్ టైన్ మెంట్ కేంద్రం కూడా. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి ముందు పశ్చిమ దేశాల రిటైల్ వ్యాపార కంపెనీలకు ఈ షాపింగ్ సెంటర్ నిలయంగా ఉండేది. మరోవైపు ఈ భారీ అగ్నిప్రమాదం వీడియో క్లిప్‌లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
massive fire inside the Mega Khimki shopping center,#Moscow
The burning area increased to 17 thousand square meters.#Fire #MegaKhimki #Russia #Moscow pic.twitter.com/o2NiCRP0x0— Devesh (@Devesh81403955) December 9, 2022
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!