Kseniya Alexandrova: రష్యాకు చెందిన మోడల్, మాజీ మిస్ యూనివర్స్ కంటెస్టెంట్ క్సేనియా అలెగ్జాండ్రోవా (30) దురదృష్టకర కారు ప్రమాదంలో మృతిచెందారు. ఆమె మాస్కోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కేవలం నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్న ఆమె మరణం రష్యాలో మాత్రమే కాక, అంతర్జాతీయంగా కూడా తీవ్ర విషాదానికి గురిచేసింది. జూలై 5న అలెగ్జాండ్రోవా తన భర్తతో కలిసి ర్జేవ్ నుండి ఇంటికి బయలుదేరారు. ఆ సమయంలో వారి కారు ఆకస్మాత్తుగా రోడ్డుపైకి…
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ (Ajit Doval) మాస్కో పర్యటనకు వెళ్లారు. అయితే, ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో భారత్-రష్యా మధ్య నేడు కీలక సమావేశం జరగబోతుంది.
ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శతవిధాలా ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలేమీ ఫలించలేదు. దీంతో ట్రంప్‌నకు సహనం నశించింది. ఎన్ని సార్లు చెప్పినా పుతిన్ మాట వినడం లేదని కోపం కట్టలు తెంచికొచ్చినట్లుంది.
రష్యా ఒక చారిత్రాత్మక అడుగు వేసి ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించింది. ఇప్పటివరకు ఏ దేశం కూడా తాలిబన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించకపోవడంతో ఈ చర్య ప్రపంచ రాజకీయాల్లో సంచలనంగా మారింది. తాలిబన్లు నియమించిన కొత్త ఆఫ్ఘన్ రాయబారి గుల్ హసన్ హసన్‌ను అంగీకరిస్తూ రష్యా ప్రభుత్వం ఈ ప్రకటన విడుదల చేసింది. దీనితో, తాలిబన్ పాలనను అధికారికంగా గుర్తించిన మొదటి దేశంగా రష్యా నిలిచింది. ఆగస్టు 2021లో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ అధికారంలోకి వచ్చింది. Also…
Russia: రష్యా-భారతదేశం-చైనా (RIC) ఫార్మాట్‌లోని కార్యకలాపాల పునరుద్ధరణకు రష్యా ప్రయత్నిస్తోందని ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ గురువారం అన్నారు. చైనా వ్యతిరేక కుట్రలోకి భారతదేశాన్ని ఆకర్షించడానికి నాటో బహిరంగంగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా రష్యా ఏటా విక్టరీ డే వేడుకలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది మే 9 మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విక్టరీ డే వేడుకలకు పలు దేశాధినేతలకు ఆహ్వానాలు పంపింది రష్యా. అందులో భాగంగా భారతదేశానికి సైతం ఆహ్వానం పంపినట్లు రష్యా తెలిపింది. అయితే భారత్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదని రష్యా అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. ఇప్పటికే…
ప్రధాని మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం పలికారు. మే 9న మాస్కోలో జరగనున్న విక్టరీ డే వేడుకల్లో మోడీ పాల్గొననున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా ప్రతి ఏడాది మే 9న ఈ విక్టరీ వేడుకలు జరుగుతుంటాయి. 8
సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అసద్(59) పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఆయన తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. మాస్కోలో ఆయనపై విషప్రయోగం జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
China–Russia: గత మూడేళ్లుగా రష్యా- ఉక్రెయిన్ల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రష్యా పర్యటనకు సిద్ధం అయ్యారు. ఈ మేరకు బీజింగ్‌లోని రష్యా రాయబారి ఇగోర్ మోర్గులోవ్ వెల్లడించారు.
సిరియా అధ్యక్షుడు అసద్ భవిష్యత్‌ను ముందే ఊహించినట్లుగా తెలుస్తోంది. ముందు జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు చక్కబెట్టుకున్నట్లు సమాచారం. తాజాగా అతడి అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.