Ajit Doval: ఉగ్ర పోరులో ద్వంద్వ వైఖరి ఉండకూడదు.. అలాంటి దేశాలను క్షమించకూడదన్న అజిత్ దోవల్
- ఉగ్ర పోరులో ద్వంద్వ వైఖరి ఉండకూడదు
- అలాంటి దేశాలపై కఠిన చర్యలుండాలి
- మాస్కో వేదికగా అజిత్ దోవల్ పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉగ్రవాదంపై పోరాటంలో దేశాలు ద్వంద్వ వైఖరి అవలంబించకూడదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్పష్టం చేశారు. ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇచ్చే నిధులు సమకూర్చే దేశాలపై బాధ్యతాయుతమైన దేశాలు కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. మాస్కోలో జరుగుతున్న తొలి అంతర్జాతీయ భద్రతా ఫోరం, భద్రతా వ్యవహారాలకు బాధ్యత వహిస్తున్న ఉన్నతాధికారుల 14వ అంతర్జాతీయ సమావేశంలో అజిత్ దోవల్ పాల్గొని ప్రసంగించారు.

Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
“ప్రతి దేశానికీ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే బాధ్యత ఉంది. ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ ప్రమాణాలకు తావు ఉండకూడదు. బాధ్యతగల దేశాలు తమ వైఖరిని స్పష్టం చేయాలి. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాల వెంట నిలుస్తాయా? లేక ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటాయా? అన్నది తేల్చుకోవాలి” అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా 2025 ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని దోవల్ ప్రస్తావించారు. భారత్ ఎన్నాళ్లుగానో ప్రభుత్వ ప్రోత్సాహంతో నడిచే ఉగ్రవాదానికి బలవుతోందని అన్నారు. “2025 ఏప్రిల్‌లో ప్రపంచం దారుణ ఘటనను చూసింది. జమ్మూకాశ్మీర్‌లో 26 మంది అమాయక పౌరులను, వారి కుటుంబాల ముందే హత్య చేశారు. మతం ఆధారంగా వారిని వేరు చేసి చంపారు” అని తెలిపారు.
దోషులపై భారత్ కఠిన చర్యలు
ఉగ్రదాడి అనంతరం దోషులపై భారత్ కఠిన చర్యలు తీసుకుందని దోవల్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి (UNSC) చేసిన ప్రకటనను భారత్ సమర్థిస్తోందన్నారు. “ఉగ్రదాడులకు పాల్పడినవారు, కుట్రదారులు, నిధులు సమకూర్చినవారు, మద్దతుదారులందరినీ బాధ్యులుగా నిలబెట్టి శిక్షించాలన్న UNSC అభిప్రాయాన్ని భారత్ పూర్తిగా సమర్థిస్తోంది. అదే నేపథ్యంలో పహల్గామ్ దాడి నిందితులపై భారత్ నిర్ణయాత్మక చర్యలు తీసుకుంది” అని తెలిపారు.
ప్రపంచ రాజకీయాల్లో మార్పులు
ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై కూడా దోవల్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రపంచం భౌగోళిక, ఆర్థిక అస్థిరతను ఎదుర్కొంటోందని చెప్పారు. యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితి, వాణిజ్య, సాంకేతిక రంగాల్లో సవాళ్లు ప్రపంచ సమీకరణాలను ప్రభావితం చేస్తున్నాయని అన్నారు. “ప్రపంచ శక్తి ఇప్పుడు కొద్ది దేశాల చేతుల్లో మాత్రమే లేదు. అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ ఆర్థిక, సైనిక సామర్థ్యాలను పెంచుకుంటున్నాయి. గ్లోబల్ సౌత్ దేశాలకు సమాన భాగస్వామ్యం లభించేలా బహుళ ధృవ ప్రపంచ వ్యవస్థ ఏర్పడుతోంది. అదే ప్రపంచ శాంతి, స్థిరత్వానికి మార్గం” అని పేర్కొన్నారు.
మే 26 నుంచి 29 వరకు మాస్కోలో జరుగుతున్న ఈ అంతర్జాతీయ సమావేశంలో 140కిపైగా దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారు. భద్రతా మండళ్ల కార్యదర్శులు, జాతీయ భద్రతా సలహాదారులు, నిఘా సంస్థల ఉన్నతాధికారులు ఈ వేదికపై చర్చలు జరుపుతున్నారు.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!