ప్రస్తుతం రోజులు మారాయి. ఇదివరకు రోజుల్లో మనకు డబ్బు అవసరం అయితే బ్యాంకుకు వెళ్లి గంటలు తరబడి లైన్లో వేచి ఉండి అనేక రకాల ఫార్మ్స్ రాసి బ్యాంకు ఉద్యోగి ఇస్తే అప్పుడు డబ్బు చేతిలోకి అందుతుంది. ఇదంతా పాత పద్ధతి. ఇప్పుడు ఏటీఎంస్ ద్వారా బ్యాంకులో వద్ద క్యూలలో నిలబడకుండా అది తక్కువ సమయంలో డబ్బులు పొందటానికి వీలు కలుగుతుంది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఆన్లైన్ ఆధార్ సేవను వినియోగించడం ద్వారా నేరుగా మన ఇంటి వద్దనే సులభంగా డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Also Read: Padala Bhudevi: కన్నీటి పర్యంతమైన జనసేన నేత.. టికెట్ ఇస్తామని చెప్పి..!
ఒకవేళ మనకి అవసరం కొద్దీ నగదు కావాలంటే బ్యాంకులకు వెళ్లాల్సిన పని లేకుండా ఇండియా పోస్టల్ చెల్లింపు ‘ఆధార ఏటీఎం’ సర్వీస్ ను తీసుకోవచ్చింది. ఇందులో భాగంగా పోస్ట్ మ్యాన్ నేరుగా మన ఇంటి వద్దకు వచ్చి నగదు డ్రా చేసి ఇస్తాడు. ఈ పక్రియ సంబంధించి ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ ‘ఆధార్ ఎటిఎం’ అనే ఫీచర్ ని మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ఆధార్ కార్డు ఉన్న వారందరూ వారి బయోమెట్రిక్ లను ఉపయోగించుకుని ఏటీఎం నుండి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. అయితే ఇందుకోసం సదరు ఆధార్ కార్డుకు సంబంధించి ఏదైనా బ్యాంకు ఖాతా కచ్చితంగా జత చేసి ఉండాలి. ఇకపోతే ఈ డబ్బులు తీసుకునందుకు ఎటువంటి ఎక్స్ట్రా చెల్లింపులు చేయకుండా నగదును విత్ డ్రా చేసుకోవచ్చు.
Also Read: AP Elections 2024: ఎన్నికల వేళ ఏపీలో భారీగా పట్టుబడుతున్న మద్యం, డబ్బు, గంజాయి..
ఇందులో మొదటగా.. ఆధార్ ATM ప్రయోజనాన్ని పొందడానికి ముందుగా మనము IPPB అధికారిక వెబ్‌సైట్ https://www.ippbonline.com/web/ippb ను క్లిక్ చేయగా హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది. హోమ్ పేజీకి వెళ్లిన తర్వాత, మీరు డోర్ స్టెప్ బ్యాంకింగ్ https://www.ippbonline.com/web/ippb/doorstep-banking ఎంపిక పై క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత మీరు జాగ్రత్తగా నింపాల్సిన ఫారమ్ మీ ముందు వస్తుంది. ఇక అక్కడ అడిగిన మొత్తం సమాచారాన్ని అందించాలి. ఆ తర్వాత మనము సమీపంలో ఉన్న పోస్టాఫీసు పేరును నమోదు చేసి, ప్రొసీడ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇలా అన్ని దశలను అనుసరించిన తర్వాత మనం సులభంగా ఆధార్ ఎటిఎం ని పొందుతాము. దాంతో ఓ పోస్టల్ ఉద్యోగి మీ ఇంటికి వచ్చి డబ్బులు విత్ డ్రా చేసి ఇస్తారు.