Nehal Modi: పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారీ నీరవ్ మోడీ సోదరుడు నేహాల్ మోడీని అమెరికాలో అధికారులు అరెస్ట్ చేశారు. భారత అప్పగింత అభ్యర్థన మేరకు అమెరికా అధికారులు ఇతడిని అదుపులోకి తీసుకున్నారు. నేహాల్ మోడీని కోట్లాది రూపాయల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణానికి సంబంధించి అమెరికాలో అరెస్టు చేశారు, ఇది భారతదేశానికి పెద్ద దౌత్య విజయం. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ప్రకారం, బెల్జియన్ జాతీయుడైన నేహాల్ మోడీని జూలై 4న అదుపులోకి తీసుకున్నారు.
Allu Aravind : నిర్మాత అల్లు అరవింద్ ను ఈ రోజు ఈడీ అధికారులు విచారించడం సంచలనం రేపింది. అసలు సడెన్ గా ఆయన్ను ఎందుకు ఈడీ విచారించింది.. ఆ స్కామ్ కు ఆయనకు సంబంధం ఏంటి అంటూ ఒకటే రూమర్లు తెరమీదకు వచ్చాయి. ఎట్టకేలకు ఈ విచారణపై అల్లు అరవింద్ స్పందించారు. “నేను 2017లో ఒక ప్రాపర్టీ కొన్నాను. అందులో ఒక ఒక మైనర్ వాటాదారుడు ప్రాపర్టీ కొన్నాను. కానీ కొన్న తర్వాత అతని మీద…
Allu Aravind : సినీ నిర్మాత అల్లు అరవింద్ కు ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఎన్నడూ ఎలాంటి కేసుల్లో ఇరుక్కోని అరవింద్ సడెన్ గా ఈడీ ముందు హాజరుకావడం సంచలనం రేపింది. ఆయన్ను మూడు గంటల పాలు అధికారులు ప్రశ్నించారు. ఓ బ్యాంక్ స్కామ్ లో ఆయన్ను ప్రశ్నించారు 2018- 19 మధ్య రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ అండ్ రామకృష్ణ టెలోక్ట్రానిక్స్ పేరుతో రెండు సంస్థలు ఏర్పాటు చేశారు. ఈ రెండు సంస్థలు కలిసి యూనియన్ బ్యాంక్…
బెట్టింగ్ యాప్స్‌పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చిందని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ పాల్ అన్నారు. బెట్టింగ్ యాప్స్‌పై కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చిందన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్‌ల వల్ల వేల మంది చనిపోయారని గుర్తు చేశారు. లక్షలు, కోట్లు అప్పులు చేస్తూ.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలను అడ్డుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని సుప్రీం కోర్టు ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చిందని తెలిపారు.
ఫాల్కన్ స్కాం కేసులో సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో సీఐడీ మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. తెలంగాణ సీఐడీ బీహార్ లో ఇద్దరిని అరెస్ట్ చేసింది. పట్టుబడ్డ ఇద్దరు నిందితులు A2 అమర్ దీప్ కుటుంబ సభ్యులు. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కాంలో నేరస్థులుగా ఉన్నారని..
Keshineni Nani : మాజీ ఎంపీ కేశినేని నాని మరోసారి లిక్కర్ స్కామ్‌పై తన గళం విప్పారు. ఈసారి ఆయన లక్ష్యం ప్రస్తుత ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని). లిక్కర్ స్కామ్‌లో ఎంపీ చిన్ని పాత్రపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి రాసిన లేఖను శనివారం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ, లిక్కర్ స్కామ్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిట్ విచారణకు ఆదేశిస్తే,…
ఓబుళాపురం మైనింగ్ కేసులో కోర్టు తీర్పుని స్వాగతిస్తున్నట్లు మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఇటువంటి తీర్పులు వెలువడినప్పుడు మైనింగ్ లో అక్రమాలు చెయ్యాలనుకునే వారికి దడ పుడుతుందన్నారు.. ఇలాంటి కేసులకు ప్రత్యేక కోర్టుల ద్వారా త్వరితగతిన విచారణ చేపట్టి తీర్పుని వెలువర్చే విధంగా ఫాస్ట్ ట్రాక్ ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.. ఎంత ఆలస్యం అయితే అంత నీరుగారే ప్రమాదం ఉంటుందని స్పష్టం చేశారు..
ED Raids: హైదరాబాద్ నగరంలో రెండవ రోజూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు కొనసాగుతున్నాయి. దేశంలో ఆర్థిక నేరాలను అరికట్టే ఉద్దేశంతో ఈడీ చేపట్టిన ఈ దాడుల్లో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా సురానా ఇండస్ట్రీస్ ఎండీ నరేంద్ర సురానా నివాసంలో పెద్దఎత్తున నగదు స్వాధీనం కావడం కలకలం రేపుతోంది. ఈడీ ప్రాథమిక విచారణలో నరేంద్ర సురానా పలు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి, బ్యాంకుల నుంచి పొందిన రుణాలను వీటి ద్వారా అక్రమ…
గురుగ్రామ్ భూమి కేసుకు సంబంధించి వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా బుధవారం వరుసగా రెండో రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలోనికి వెళ్లారు. 2008 హర్యానా భూ ఒప్పందం, మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాను ఈడీ విచారిస్తోంది. మంగళవారం దాదాపు ఐదు గంటల పాటు విచారించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PLMA) కింద ఆయన వాంగ్మూలాలను నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. బుధవారం కూడా వాదనలు కొనసాగాయి. ఈ సందర్భంగా రాబర్ట్…
Online Betting : బెట్టింగ్ ఆప్స్ పైన కేంద్రం కొరడా చూపిస్తుంది. సినీ ప్రముఖులు రాజకీయ నేతలు క్రికెటర్లు పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్స్ కొరకు ప్రచారం చేస్తున్నారని కేంద్రం చెబుతుంది. బెట్టింగ్ యాప్స్ వెనకాల భారీ కుట్ర దాగి ఉందని కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్ శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా 700 పైసలుకు అధికారికంగా బెట్టింగ్ యాప్స్ నడుస్తున్నాయని ఇందులో 357 ఆప్స్ అనధికారికంగా వ్యాపార లాభాలు నిర్వహిస్తున్నాయని జీఎస్టీ ఇంటలిజెన్స్ శాఖకు గుర్తించింది. 357 ఆప్స్…