మనీలాండరింగ్ కేసులోఈ నెల 2న అరెస్టైన మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు ముంబయి కోర్టు షాకిచ్చింది. అనిల్ దేశ్‌ముఖ్‌కు 14 రోజుల కస్టడీ విధించింది. ఈ సందర్భంగా తనకు రోజూ ఇంటి భోజనం తెప్పించుకునేందుకు అనుమతించాలని అనిల్ దేశ్‌ముఖ్ కోర్టును కోరారు. అయితే ఆయన కోరికను కోర్టు తోసి పుచ్చింది. “ముందుగా జైలు కూడు తినండి. ఒకవేళ తినలేకపోతే అప్పుడు మీ కోరికను పరిగణలోకి తీసుకుంటాం” అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా…
క్రిప్టో కరెన్సీతో దేశ యువత మోసపోవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. క్రప్టో కరెన్సీపై ప్రధాన మంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన యువ తను హెచ్చరించారు. యువతను తప్పుదారి పట్టించే ప్రకటనలపై ఆందోళనలు లేవనెత్తారు. “పారదర్శకత లేని కరెన్సీ ప్రకటనల” ద్వారా యువతను తప్పుదోవ పట్టకుండా జాగ్రత్తగా మసలుకోవాలని ప్రధాని సూచించారు. దీనికి సంబంధించి విస్తృతంగా చర్చలు జరగాల్సిన అవసరముందన్నారు. వివిధ దశలలో దీనిపై నిర్ణయం తీసుకోవడానికి ఏకాభిప్రాయం కోసం…