Keshineni Nani : మరోసారి లిక్కర్ స్కామ్‌పై కేశినేని కీలక వ్యాఖ్యలు
- ఎంపీ చిన్ని పాత్రపై ఈడీకి నాని లేఖ
- ప్రైవేట్ కంపెనీల ద్వారా మనీలాండరింగ్ ఆరోపణలు
- రూ. 2,000 కోట్ల చైన్ లింక్ స్కామ్‌లో భాగస్వాములుగా అనుమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Keshineni Nani : మాజీ ఎంపీ కేశినేని నాని మరోసారి లిక్కర్ స్కామ్‌పై తన గళం విప్పారు. ఈసారి ఆయన లక్ష్యం ప్రస్తుత ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని). లిక్కర్ స్కామ్‌లో ఎంపీ చిన్ని పాత్రపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి రాసిన లేఖను శనివారం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ, లిక్కర్ స్కామ్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిట్ విచారణకు ఆదేశిస్తే, ఎంపీ చిన్నికి దానిపై నమ్మకం లేక సీబీఐ విచారణ కోరారని గుర్తు చేశారు. వ్యాపార భాగస్వామి రాజ్ కసిరెడ్డి ద్వారా మద్యం కుంభకోణంతో సంబంధం ఉన్న ఆర్థిక లావాదేవీలలో ఎంపీ చిన్ని కీలక పాత్ర పోషించారని ఆయన ఆరోపించారు.
Pakistan Economy: పాకిస్తాన్ బడ్జెట్ రిలయన్స్ ఆదాయంలో సగం!
Also Read
- Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
- 100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
- LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
- 42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
అంతేకాకుండా, అధికారిక రికార్డులు , బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, కేశినేని శివనాథ్, ఆయన భార్య జానకీ లక్ష్మి , రాజ్ కసిరెడ్డి ‘Pryde Infracon LLP’తో పాటు మరికొన్ని ఇతర వ్యాపారాలలో భాగస్వాములుగా ఉన్నారని నాని పేర్కొన్నారు. ఈ సంస్థలను నేరానికి సంబంధించిన సొమ్మును మళ్లించడానికి ఉపయోగించి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA), 2002ను ఉల్లంఘించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
మనీ లాండరింగ్ వ్యవహారం భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా విస్తరించి ఉందని, ఇందులో కేశినేని శివనాథ్ కుటుంబ సభ్యులు, సన్నిహిత స్నేహితులు , దీర్ఘకాలిక వ్యాపార భాగస్వాములు అనేక కంపెనీలు , ఎల్‌ఎల్‌పీలలో భాగస్వాములుగా ఉన్నారని నమ్మడానికి బలమైన కారణాలు ఉన్నాయని నాని తన లేఖలో పేర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేశినేని శివనాథ్ , ఆయన వ్యాపార భాగస్వాములలో కొందరు వ్యక్తులు దాదాపు రూ. 2,000 కోట్ల చైన్-లింక్ కుంభకోణంతో కూడా సంబంధం కలిగి ఉన్నారని ఆరోపణలు ఉన్నాయని నాని తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో FIR నం. 266/2023 తేదీ 16/09/23 కింద దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని ఆయన వెల్లడించారు.
Attaullah Tarar : కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనపై పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు.
తాజావార్తలు
-
Dhanush’s ‘OM’ : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ “ఓమ్”.. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
-
Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
-
Suriya – Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
ట్రెండింగ్
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!