Allu Aravind : నిర్మాత అల్లు అరవింద్ ను ఈ రోజు ఈడీ అధికారులు విచారించడం సంచలనం రేపింది. అసలు సడెన్ గా ఆయన్ను ఎందుకు ఈడీ విచారించింది.. ఆ స్కామ్ కు ఆయనకు సంబంధం ఏంటి అంటూ ఒకటే రూమర్లు తెరమీదకు వచ్చాయి. ఎట్టకేలకు ఈ విచారణపై అల్లు అరవింద్ స్పందించారు. “నేను 2017లో ఒక ప్రాపర్టీ కొన్నాను. అందులో ఒక ఒక మైనర్ వాటాదారుడు ప్రాపర్టీ కొన్నాను. కానీ కొన్న తర్వాత అతని మీద ఈడీ ప్రాబ్లమ్ ఉన్నట్టు తెలిసింది. నాకు ముందు తెలియలేదు.
Read Also : Chiranjeevi : పవన్ రాకుంటే రంగంలోకి చిరంజీవి..?
అతను బ్యాంక్ లోన్ తీసుకుని ఎగ్గొటాడని తెలిసింది. అప్పటి నుంచే అతని మీద ఈడీ నిఘా ఉంది. కానీ ఈడీ దగ్గర ఉన్న బుక్ ఆఫ్ అకౌంట్స్ లో నా పేరు ఉంది. అందుకే ఈడీ అధికారులు నన్ను విచారణకు పిలిచారు. ఒక బాధ్యత గల పౌరుడిగా నేను వెళ్లాను. వాళ్లు అడిగిన వాటికి సమాధానాలు ఇచ్చాను. అంతే తప్ప ఇందులో ఇంకేమీ లేదు. మీడియా వాళ్లే కావాలని దీన్ని పెద్దది చేసి చూపించారు. వాళ్ళు ఎంక్వయిరీకి పిలిస్తే వెళ్లాను. అంతకు మించి ఏమీ లేదు” అంటూ చెప్పుకొచ్చారు అల్లుఅరవింద్. దాంతో ఈ రూమర్లకు చెక్ పడ్డట్టు అయింది. అరవింద్ ప్రస్తుతం వరుస సినిమాలను నిర్మిస్తూ బిజీగా ఉంటున్నారు.
Read Also : Rahul Gandhi: “శానిటరీ ప్యాడ్ ప్యాకెట్ల”పై రాహుల్ గాంధీ బొమ్మ.. కాంగ్రెస్‌పై విమర్శలు..