Modi Retirement Debate: నాగ్‌పూర్‌లో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త మోరోపంత్ పింగ్లేపై రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ.. 75 ఏళ్లు వచ్చిన వాళ్లు కొత్త తరం వారికి మార్గం ఇవ్వాలి అని సూచించారు. అందుకు మోరోపంత్ జీవితాన్ని గుర్తు చేస్తూ.. ఒకసారి పింగ్లే చెప్పారు: 75వ సంవత్సరంలో మీకు శాలువా పడితే, అది పదవికి వీడ్కోలు చెప్పే సంకేతంగా భావించాలని పేర్కొన్నారు.. దేశ సేవలో పింగ్లే ఎంత నిబద్ధత చూపించారో, వయస్సు వచ్చినప్పుడు పక్కకు తగ్గిపోవడం ఒక సంస్కారం అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలియజేశారు. ఇక, ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. భవిష్యత్ రాజకీయ మార్పులకు ఇవి సంకేతమా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
Read Also: CM Chandrababu: వైద్య విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. సీఎం సీరియస్.. కీలక ఆదేశాలు
ఇక, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సంబంధించి చేశారని పేర్కొనింది. రాబోయే సెప్టెంబర్‌లో మోడీ, భగవత్ లకు 75 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారని తెలిపారు. ఇక, పేద ప్రధాని గొప్ప విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి వచ్చారు అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఎద్దేవా చేశారు. 75 ఏళ్లు నిండిన వాళ్లు పదవీ నుంచి తప్పుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలకు జోడిస్తూ.. ఎక్స్ (ట్విట్టర్) లో వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.