జూలై 18న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అయితే అదేరోజు రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈనేపథ్యంలో.. వీటిని దృష్టిలో పెట్టుకుని 17వ తేదీ ఉదయం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ నిర్ణయించింది. అయితే.. సంబంధిత మంత్రి ప్రహ్లాద్ జోషి, సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులు.. ఎజెండాలోని ఇతరత్రా అంశాల గురించి ఆయా పార్టీల నేతలకు వివరించి, వారి సహకారం కోరనున్నారు. ఈకార్యక్రమంలో.. ప్రధాని మోదీ మర్యాదపూర్వకంగా అఖిలపక్ష సమావేశానికి హాజరవుతారు. జూలై 18న (అదే రోజు) సాయంత్రం…
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ తర్వాత తెలంగాణలో వరస కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు కమలనాథులు. హైదరాబాద్లో మీటింగ్స్ ముగిసిన 24 గంటల్లోనే మూడు కమిటీలు ప్రకటించి తమ దూకుడేంటో తెలియజెప్పారు. వీటిల్లో చేరికల కమిటీ పెద్ద చర్చకే దారితీస్తోంది. మొన్నటి వరకు ఆ చేరికల కమిటీకి బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి నేతృత్వం వహించారు. తాజాగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సారథ్యంలో చేరికల కమిటీని సిద్ధం చేసింది ఢిల్లీ నాయకత్వం.…
దిగ్గజ స్వరకర్త ఇళయరాజా, ప్రముఖ సినీ నిర్మాత విజయేంద్ర ప్రసాద్ బుధవారం రాజ్యసభకు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. నామినేషన్ల అనంతరం ప్రతిష్టాత్మకంగా నిలిచిన కళాకారులకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. రాజ్యసభకు అర్హులైన ప్రముఖులను ఎంపిక చేసినందుకు ప్రధాని మోదీకి మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపారు. సినిమా పరిశ్రమకు చెందిన అత్యంత అర్హులైన ప్రముఖులైన కె.వి.విజయేంద్ర ప్రసాద్, ఇళయరాజాలకు రాజ్యసభ సభ్యులుగా రాష్ట్రపతి నామినేషన్కు అర్హమైన గౌరవాన్ని అందించినందుకు గౌరవప్రదమైన ప్రధాన మంత్రి…