Iran Vs Israel War: ఒకే యుద్ధం.. మూడు కథలు.. మూడు నిజాలు..! ఇరాన్ గెలవబోతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధానికి ముగింపు ఎక్కడుందో ఎవరికీ తెలియదు..అయితే గెలుపును మాత్రం ఎవరికి వారు ఓన్ చేసుకుంటున్నారు. అమెరికా తన విజయాన్ని ప్రకటించుకుంటోంది. ఇజ్రాయెల్ తమ దాడులు ఫలించాయని చెబుతోంది.. ఇరాన్ మాత్రం ఇంకా నిలబడే ఉన్నామని గర్వంగా చెబుతోంది..! ఒకే యుద్ధం.. మూడు కథలు.. మూడు నిజాలు.. ఇంతకి అసలు నిజం ఏంటి? ఇప్పుడీ యుద్ధంలో నిజంగా ఎవరు ముందంజలో ఉన్నారు?
ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధం ఇప్పుడు మూడో వారంలోకి వెళ్లింది. మొదటి దశలో అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యం స్పష్టంగా ఇరాన్ నాయకత్వాన్ని దెబ్బతీయడం. ఆ ఆపరేషన్‌లో ఇరాన్ సుప్రీం లీడర్ సహా పలువురు కీలక కమాండర్లు హతమయ్యారు.
ఇది ఒక పెద్ద టాక్టికల్ విజయం. కానీ అదే సమయంలో పాలనా వ్యవస్థ కూలిపోలేదు. గంటల వ్యవధిలోనే కొత్త నాయకత్వం ఏర్పడింది. అంటే డెకాపిటేషన్ స్ట్రాటజీ పూర్తిగా ఫలించలేదని చెప్పవచ్చు. సైనికంగా చూస్తే అమెరికా, ఇజ్రాయెల్ ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. కానీ ఇరాన్ ప్రతిస్పందన కూడా తగ్గలేదు. ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ లాంటి సంస్థల అంచనాల ప్రకారం గత రెండు వారాల్లో ఇరాన్ వందల సంఖ్యలో మిసైళ్లు, డ్రోన్లు ప్రయోగించింది. సెజ్జిల్ లాంటి లాంగ్‌రేంజ్ బాలిస్టిక్ మిసైళ్లు కూడా ఉపయోగించింది. దీనిబట్టి చూస్తే ఇరాన్ మిసైల్ సామర్థ్యం పూర్తిగా దెబ్బతినలేదని చెప్పవచ్చు.
Also Read
- Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
- Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
- Mithali Raj: 'నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు'.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
- Mithali Raj: 'సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..' పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
ఇక కీలక అంశం హోర్ముజ్ జలసంధి. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20 శాతం ఈ మార్గం మీదుగా వెళ్తుంది. ఈ మార్గం అస్థిరంగా మారడంతో గ్లోబల్ మార్కెట్లపై భారీ ప్రభావం పడింది. చమురు ధరలు కొన్ని రోజుల్లోనే 15 నుంచి 25 శాతం వరకు పెరిగాయి. షిప్పింగ్ ఇన్సూరెన్స్ ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. ఇది సైనిక విజయానికి సంబంధం లేకపోయినా, వ్యూహాత్మకంగా ఇరాన్ పైచేయి సాధించిన ప్రాంతం. మానవ నష్టం కూడా తీవ్రంగా ఉంది.
ఇరాన్ వర్గాల ప్రకారం 1,800 మందికి పైగా మరణాలు వారి దేశంలో నమోదయ్యాయి. ఇందులో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ వైపు నష్టాలు తక్కువగా ఉన్నా, రాజకీయంగా మాత్రం అవి ప్రభావం చూపుతున్నాయి. అమెరికాలో ట్రంప్ నిర్ణయాల పట్ల సొంత పార్టీ నేతలే బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇజ్రాయెల్ కోసం ట్రంప్ అమెరికా ఆర్థికవ్యవస్థను దెబ్బతీస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు గ్లోబల్ ట్రేడ్ రూట్స్ మారుతున్నాయి. ట్యాంకర్లు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాల్సి వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో రవాణా ఖర్చులు 30 నుంచి 40 శాతం వరకు పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఇది ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పుడు గెలుపు అనే మాటను ఎలా నిర్వచిస్తామన్నది కీలకం.
అమెరికా, ఇజ్రాయెల్ టాక్టికల్‌గా ఇరాన్‌ను బలంగా కొట్టాయి. కీలక నాయకులను టార్గెట్ చేశాయి. కొన్ని సైనిక స్థావరాలను ధ్వంసం చేశాయి. కానీ స్ట్రాటజిక్‌గా చూస్తే ఇరాన్ ఇంకా నిలబడే ఉంది. యుద్ధాన్ని కొనసాగించే సామర్థ్యం ఉంది. గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లను ప్రభావితం చేసే స్థాయిలో ఉంది. నిజానికి ఆధునిక యుద్ధాల్లో గెలుపు అంటే కేవలం శత్రువును ఓడించడం కాదు.. తానే కూలిపోకుండా నిలబడటం కూడా గెలుపే. ఈ లాజిక్ ప్రకారం చూస్తే ఇరాన్ సర్వైవల్ స్ట్రాటజీతో ముందంజలో ఉన్నట్టు కనిపిస్తోంది. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ వద్ద ఉన్న సైనిక శక్తి ఎప్పటికైనా పరిస్థితిని మార్చగలదు. కానీ ఫుల్ విక్టరీ అంటే పాలన మార్పు, అణు సామర్థ్యం పూర్తిగా నాశనం కావడం..! ఇవి ఇప్పటివరకు సాధ్యం కాలేదు. ఇక ఈ యుద్ధం ఎలా ముగుస్తుందో చెప్పడానికి మూడు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. దీర్ఘకాలిక దాడులు కొనసాగి ఇరాన్ చర్చలకు రావడం. రెండోది.. ఉద్రిక్తతలు మరింత పెరిగి పెద్ద యుద్ధంగా మారడం. మూడోది,, ఇండియా, ఖతార్, చైనా వంటి దేశాలు మధ్యవర్తిత్వం చేయడం ద్వారా ఒక ఒప్పందం రావడం.
చివరికి ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారన్నది ఇప్పుడే చెప్పలేం. కానీ ఒక విషయం మాత్రం ఖాయం.. ఈ పోరాటం ఎంతకాలం సాగితే, అంత ఖర్చును ప్రపంచం మొత్తం చెల్లించాల్సిందే!
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్‌కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!