IPL 2026 Records: మెయిడెన్ ఓవర్ల మాయాజాలం.. ఐపీఎల్‌లో మొత్తం మనోళ్లదే హవా!
- ఐపీఎల్ అంటేనే బ్యాటర్ల హవా
- మెగా లీగ్‌లో కూడా మెరిసిన బౌలర్లు
- ఐపీఎల్‌లో మొత్తం మనోళ్లదే హవా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Most Maiden Overs in IPL History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటే సాధారణంగా బ్యాటర్ల హవా ఎక్కువగా ఉంటుంది. భారీ సిక్సులు, ఫోర్లు, హై స్కోర్లు అభిమానులను అలరిస్తుంటాయి. కానీ ఈ మెగా లీగ్‌లో బౌలర్లు కూడా తమ అద్భుత ప్రతిభతో మ్యాచ్‌లను మలుపుతిప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా మెయిడెన్ ఓవర్లు మ్యాచ్‌లో కీలక మలుపు తీసుకొస్తాయి. మెయిడెన్ ఓవర్లు వేయడం ద్వారా బ్యాటర్లను పూర్తిగా కట్టడి చేసి జట్టుకు విజయాలు అందిస్తుంటారు. ఐపీఎల్ 2026 నేపథ్యంలో మెయిడెన్ ఓవర్ల మాయాజాలం చూపిన బౌలర్ల లిస్ట్ ఓసారి చూద్దాం.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మెయిడెన్ ఓవర్లు వేసిన బౌలర్ల జాబితాలో టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు. ఐపీఎల్ చరిత్రలో భువీ 14 మెయిడెన్ ఓవర్లు వేశాడు. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్, స్వింగ్ బౌలింగ్‌తో బ్యాటర్లను అతడు ఇబ్బంది పెట్టాడు. ముఖ్యంగా పవర్‌ప్లేలో వికెట్లు తీయడంలో భువనేశ్వర్ ప్రత్యేక నైపుణ్యం చూపించాడు. ఐపీఎల్‌లో అత్యంత విశ్వసనీయమైన పేసర్లలో భువనేశ్వర్ ఒకడు. భువీతో సమానంగా 14 మెయిడెన్ ఓవర్లతో మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ కూడా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. తన అద్భుతమైన కంట్రోల్, బాల్‌ను రెండు వైపులా స్వింగ్ చేయగల సామర్థ్యంతో ప్రవీణ్ బ్యాటర్లకు పెద్ద సవాల్‌గా నిలిచాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ ప్రారంభ ఓవర్లలో అతడి బౌలింగ్ అద్భుతంగా ఉండేది.
Also Read
- IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
- Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
- IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
- IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
Also Read: IPL 2026 Injury List: గాయాల దెబ్బ, స్టార్ ప్లేయర్స్ ఔట్.. ఐపీఎల్ జట్లకు భారీ షాక్!
మూడో స్థానంలో న్యూజీలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఉన్నాడు. అతడు ఐపీఎల్ టోర్నీలో 11 మెయిడెన్ ఓవర్లు వేశాడు. పవర్‌ప్లేలో వికెట్లు తీయడంలో బౌల్ట్ తన ప్రతిభను చాటాడు. నాలుగో స్థానంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ 10 మెయిడెన్ ఓవర్లతో ఉన్నాడు. తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పఠాన్ ఎన్నో మ్యాచ్‌ల్లో ప్రభావం చూపించాడు. ఇక శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ, టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా, భారత్ పేసర్ సందీప్ శర్మలు ఎనమిదేసి మెయిడెన్ ఓవర్లతో ఈ జాబితాలో కొనసాగుతున్నారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బుమ్రా, మలింగాల యార్కర్లు బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి.
ఐపీఎల్ లాంటి బ్యాటింగ్ ఫ్రెండ్లీ లీగ్‌లో కూడా బౌలర్లు తమ క్రమశిక్షణ, కచ్చితత్వంతో మ్యాచ్‌లను ప్రభావితం చేయగలరని ఈ గణాంకాలు ఒక విషయం స్పష్టం చేస్తున్నాయి. మెయిడెన్ ఓవర్లు వేయడం అంటే కేవలం పరుగులు ఆపడం మాత్రమే కాదు, ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచి వికెట్లు సాధించడానికి మార్గం సృష్టించడం కూడా. ఐపీఎల్‌లో బౌలర్ల ప్రాధాన్యత ఎంత ముఖ్యమో ఈ రికార్డులు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
ట్రెండింగ్
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!