బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ తర్వాత తెలంగాణలో వరస కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు కమలనాథులు. హైదరాబాద్‌లో మీటింగ్స్ ముగిసిన 24 గంటల్లోనే మూడు కమిటీలు ప్రకటించి తమ దూకుడేంటో తెలియజెప్పారు. వీటిల్లో చేరికల కమిటీ పెద్ద చర్చకే దారితీస్తోంది. మొన్నటి వరకు ఆ చేరికల కమిటీకి బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి నేతృత్వం వహించారు. తాజాగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సారథ్యంలో చేరికల కమిటీని సిద్ధం చేసింది ఢిల్లీ నాయకత్వం.…
దిగ్గజ స్వరకర్త ఇళయరాజా, ప్రముఖ సినీ నిర్మాత విజయేంద్ర ప్రసాద్ బుధవారం రాజ్యసభకు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. నామినేషన్ల అనంతరం ప్రతిష్టాత్మకంగా నిలిచిన కళాకారులకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. రాజ్యసభకు అర్హులైన ప్రముఖులను ఎంపిక చేసినందుకు ప్రధాని మోదీకి మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపారు. సినిమా పరిశ్రమకు చెందిన అత్యంత అర్హులైన ప్రముఖులైన కె.వి.విజయేంద్ర ప్రసాద్, ఇళయరాజాలకు రాజ్యసభ సభ్యులుగా రాష్ట్రపతి నామినేషన్‌కు అర్హమైన గౌరవాన్ని అందించినందుకు గౌరవప్రదమైన ప్రధాన మంత్రి…
డబుల్ ఇంజన్ పాలన అంటే తిరోగమన పాలన అంటూ బీజేపీ పై మంత్రి హరీష రావు మండిపడ్డారు. అమిత్ షా నిధులు మీకు అందాయా అని అడిగే కంటే ముందు, తెలంగాణ కు ఇవ్వాల్సిన నిధులు ఇచ్చారా చెప్పండని ప్రశ్నించారు. నియామకాల గురించి మాట్లాడే నైతిక హక్కు బిజెపి కి లేదని మండిపడ్డారు. మోడీ రెండు కోట్ల ఉద్యోగాల నియామకాల ప్రకటన బోగస్ అంటూ విమర్శించారు. మా వైపు ఒక్క వేలు చూపిస్తే.. మీ వైపు రెండు…
ప్రధాని మోడిప్రసంగంపై రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఫైర్ అమ్యారు. వెల్ వేటెడ్ కారిడార్ ఎక్కడ ఉందో చెప్పాలని ప్రశ్నించారు. డబుల్ ఇంజిన్ వస్తుంది.. కానీ అది కేసీఆర్ నేతృత్వంలో వస్తుందని పేర్కొన్నారు. మోడీ మాటల్లో అన్ని అబద్ధాలే అని మండిపడ్డారు. వెల్ వేటెడ్ కారిడార్ ఎక్కడ ఉందో చెప్పాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. రోడ్లకు నిధులిచ్చింది లేదు.. విదిలిచ్చింది లేదంటూ ఎద్దేవ చేసారు. సిగ్నల్ ఫ్రీ సహచర మంత్రి కేటీఆర్ చొరవతోటే…