యాదాద్రిలో బీజేపీ ఎంపీ డా.కె.లక్ష్మణ్ (Mp Laxman) కేసీఆర్ కుటుంబ పాలనపై నిప్పులు చెరిగారు. అవినీతి పరులు రాజకీయ అండదండలతో తప్పించుకునే వారికి ఎవరూ కూడా మద్దతు ఇవ్వకూడదు. అవినీతి పార్టీలు కుటుంబం పార్టీలు న్యాయ పరమైన సంస్థల కు రాజకీయాలను ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం కోసమా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బూడిదలో పోసిన పన్నీరు లా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు అధికార పార్టీకి ఆదాయం ఇచ్చేప్రాజెక్టుగా మారింది.
Read Also: MP Gorantla Madhav Live : నేను చెప్పింది చేస్తే రాజీనామా చేస్తా..!
కాళేశ్వరం ప్రాజెక్టు వండర్ కాదు… బ్లండర్..గోదావరి మాత కేసీఆర్ (Cm Kcr) చేసిన పాపాలు మన్నించక.. కాళేశ్వరం ను ముంచి అవినీతిని బహిర్గతం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు లో వేల కోట్లు దుర్వినియోగం పరచిన హరీశ్ రావు కు..కాళేశ్వర్ రావు అని పేరు పెట్టాలన్నారు లక్ష్మణ్. మునుగోడు ఉప ఎన్నికల్లో కుటుంబ అవినీతి పాలనకు చరమ గీతం పాడాలి. టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు ఒక్కటే… 12 మంది ఎమ్మెల్యేలు టీ యర్ ఎస్ పార్టీలోకి పోయిన స్పందించని కాంగ్రెస్ నైజం ను గ్రహించి రాజగోపాల్ రెడ్డి బీజేపీ లో చేరారు. మునుగోడు ఉప ఎన్నికలు ఫలితాలు తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారుతుందన్నారు ఎంపీ లక్ష్మణ్.
అవినీతి పరులకు కుటుంబ పాలన పార్టీలకు మోడీ ప్రత్యర్థి. ఉప ఎన్నికలు వస్తే కానీ తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందన్నారు. ఎన్నికల ముందు దళిత బంధు ఆసరా పింఛన్లు మంజూరు చేస్తున్నారన్నారు డా.లక్ష్మణ్. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు.
Read Also: Mokshagna : మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు!?