* నేడు మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామికి టీటీడీ అధికారులు పట్టు వస్త్రాలు సమర్పణ
* నేడు మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో “న్యాయసుధ మంగళ” మహోత్సవం..వేద పండితుల ఇష్టాగోష్టి….భారీగా పాల్గొననున్న వేద పండితులు
*నేడు తిరుపతి తాజ్ హోటల్ లో కార్మిక శాఖ జాతీయ సదస్సు. సాయంత్రం 4.30గంటలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవ సందేశం
* నేడు రెండో రోజు టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో పర్యటన
*పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి అంబటి రాంబాబు
*విశాఖలో నేడు,రేపు విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీ ధరన్ పర్యటన….
సోషల్ వర్కర్స్, కమ్యూనిటీ,బిజినెస్ వర్గాలతో సమావేశాలు నిర్వహించనున్న కేంద్ర మంత్రి
*నేడు ఎమ్మెల్సీ అనంతబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై తీర్పు ఇవ్వనున్న రాజమండ్రి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టు
* విజయవాడ బీజేపీ కార్యాలయానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. మీడియా ప్రతినిధులతో చిట్ చాట్..
* ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో 11 గంటలకు విజయవాడ ఏపీడీసీఎల్ కార్యలయం వద్ద ధర్నా
* విజయవాడ ప్రభుత్వ ఐటిఐ కాలేజ్ లో జాబ్ మేళా