Dr.K.Laxman:మునుగోడు సభలో కేసీఆర్ ఓటమి కన్పించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడులో సీఎం కేసీఆర్ సభపై బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ మునుగోడు సభలో కేసీఆర్ ఓటమి కన్పించిందన్నారు. నరేంద్ర మోదీ, అమిత్ షాలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. మునుగోడు బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బాధ్యతారహితంగా మాట్లాడారు. దేశ ప్రధానమంత్రి గారు, కేంద్ర హోంశాఖ మాత్యులపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతోందనే భావన కేసీఆర్ లో కలిగినందువల్లే ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినట్లు కన్పిస్తోంది.
Read Also: Actress Nakshathra: అర్థరాత్రి బస్సులో డ్రైవర్ నీచ పని.. ఆ నటి ఏం చేసిందంటే?
Also Read
- Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
- Adilabad RIMS Fire : రిమ్స్ విషాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.!
- Food Safety : ఎక్స్పైరీ మసాలాలకు కొత్త తేదీలు.. దిల్ బహార్ యూనిట్‌పై ఎస్వోటీ దాడి
- Janasena Party: జనసేన తెలంగాణలో కొత్త కమిటీ.. జాయినింగ్ కమిటీ కన్వీనర్‌గా ప్రేమ్ కుమార్
రైతులు, యువకులను తప్పుదోవ పట్టించేందుకు కేసీఆర్ ఎంతగానో ప్రయత్నించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారంటూ కేసీఆర్ రైతులను భయపెట్టే ప్రయత్నం చేయడం సిగ్గు చేటు. ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అపోహలను తొలగించింది. అయినా కూడా కోడిగుడ్డుపై ఈకలు పీకినట్లు కేసీఆర్ పదేపదే అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారు.ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ కేంద్ర మంత్రిపై లేనిపోని అభాండాలు వేయడం శోచనీయం. ఆసరా పెన్షన్ల విషయంలో కేంద్ర మంత్రి చెప్పని విషయాలను ఆయనకు ఆపాదించడం సిగ్గు చేటు.
మునుగోడు ఓటర్లను మభ్యపెట్టేందుకు కేసీఆర్ ఎన్నో అబద్దాలాడారు. అందులో ముఖ్యమైనది సకాలంలో వర్షాలు పడి ధాన్యం దిగుబడి పెరిగితే… తాను నిర్మించిన ప్రాజెక్టుల ద్వారానే పంట దిగుబడి పెరిగినట్లు చెప్పడం హాస్యాస్పదం. ధాన్యం కొనబోమని కేంద్రం ఏనాడూ చెప్పలేదు. అయినా తన వైఫల్యాన్ని కేంద్రంపై నెట్టేసే ప్రయత్నం చేయడం విడ్డూరం. తాను రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ.. కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా చిత్రీకరించాలనుకోవడం దారుణం అన్నారు డా.లక్ష్మణ్.
కానీ తెలంగాణ రైతులకు వాస్తవాలు తెలుసు. ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఎరువుల పేరిట దేశవ్యాప్తంగా ఏటా రూ. 2 లక్షల కోట్ల సబ్సిడీ ఇస్తున్నారు. వ్యవసాయ యంత్రాల మీద కేంద్రం సబ్సిడీ ఇస్తుంటే… మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేక రైతులకు వాటిని అందకుండా చేశారు. ఫసల్ బీమా యోజనను అమలు చేయకపోవడంవల్ల భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు సాయం అందకుండా చేసిన దుర్మార్గుడు కేసీఆర్. గత ఎనిమిదేళ్లుగా ఉద్యోగాలివ్వకుండా, మూడేళ్లుగా నిరుద్యోగ భ్రుతి ఇవ్వకుండా యువతను మోసం చేసిన కేసీఆర్ ను మునుగోడు బిడ్డలు బండకేసి బాదడం ఖాయం. కేసీఆర్ ఎన్ని డ్రామాలు చేసినా మునుగోడులో టీఆర్ఎస్ ఓటమి ఖాయం… బీజేపీ గెలుపు తథ్యం అని ధీమా వ్యక్తం చేశారు డా.లక్ష్మణ్.
Read Also: Shruti Haasan: పారితోషికం అమాంతం పెంచేసింది.. ఎన్ని కోట్లో తెలుసా?
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!