రాష్ట్ర గవర్నర్ తమిలిసై తను రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నాననే మర్చిపోయారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకురాలి పాత్ర పోషిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలచే ఎన్నుకోబడిన కేసీఆర్ ను కేంద్రంచే నియమించబడిన గవర్నర్ ఎలా విమర్శిస్తుంది..? అని ప్రశ్నించారు. మోడీ ఏది చెప్తే గవర్నర్ అదే మాట్లాడుతున్నారని విమర్శించారు. గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలను కూలదోస్తున్నారన్నారు. పార్టీలకు అతీతంగా ఉండాల్సిన గవర్నర్ రాజ్ భవన్ లో…