వైసీపీపై బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర నిధులు వద్దంటూ రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా లేఖలు రాస్తోందన్నారు. కేంద్రం ఇచ్చే ప్రాజెక్టులు మాకొద్దంటూ జగన్ ప్రభుత్వం లేఖలు రాసింది.రోడ్ల నిర్మాణం కోసం ఎన్డీబీ ప్రాజెక్టులో భాగంగా తన వాటాగా నిధులివ్వడానికి కేంద్రం సిద్దపడింది.తమ వాటా కింద ఇవ్వాల్సిన మొత్తానికి అవసరమైన నిధులు మా వద్ద లేవంటూ.. వైసీపీ ప్రభుత్వం లేఖ రాసింది.రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల రూ. 6 వేల కోట్ల మేర ఎన్డీబీ నిధులు మురిగి పోతున్నాయి.
మొదటి దశలో రూ. 2600 కోట్లకు టెండర్లు పిలిచినా నిరుపయోగంగా ఉన్న పరిస్థితి. ఇదే తరహాలో రైల్వే ప్రాజెక్టులు కూడా పక్కకు వెళ్లిపోతున్నాయి. పరిశ్రమలను అడ్డుకునే నిషయంలో వైసీపీ, టీడీపీలు పోటీ పడుతున్నాయి. ఏపీకి బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ యనమల లేఖ రాయడం దారుణం. రాష్ట్రంలో పరిశ్రమలు రాని ఈ సందర్భంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటును వ్యతిరేకించడం ఎంత వరకు సబబు అని విష్ణువర్థన్ రెడ్డి ప్రశ్నించారు. పారిశ్రామిక వేత్తలను బెదిరిస్తూ ఓవైపు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు అడ్డుకుంటుంటే.. మరో వైపు లేఖలు రాసి టీడీపీ అడ్డుకుంటోంది.
Read Also: Guntur Roads Extension: రోడ్ల విస్తరణకు మోక్షం ఎప్పుడు?
బల్క్ డ్రగ్ పార్క్ వద్దనేది యనమల వ్యక్తిగత విషయమా..? లేక టీడీపీ విధానామా..? అనేది చంద్రబాబు తేల్చి చెప్పాలి. టీడీపీ హయాంలో పరిశ్రమల కోసం చేసుకున్న ఒప్పందాల సమయంలో పర్యావరణం విషయం గుర్తుకు రాలేదా..? వైసీపీ ప్రభుత్వం విద్యా మాఫియా చెప్పు చేతల్లో ఉంది. ప్రైవేట్ స్కూళ్లల్లో పేదలకు సీట్లివ్వాలన్న నిబంధనను ఎందుకు అమలు చేయడం లేదు. హైకోర్టు ప్రభుత్వానికి అక్షింతలు వేసినా.. మంత్రి బొత్స ఎందుకప నోరు మెదపరు..? ప్రభుత్వ స్కూళ్లల్లో యాప్ లు పెట్టిన విధంగానే ప్రైవేట్ స్కూళ్లల్లోనూ యాప్ లు పెట్టాలి. నారాయణ, చైతన్య విద్యా సంస్థల విషయంలో ప్రభుత్వం మాటలకు.. చేతలకు పొంతనే లేదు.
పొత్తులు నిర్ణయించేది.. పార్టీ హైకమాండే. వారసత్వ పార్టీలకు.. అవినీతి పార్టీలకు మేం వ్యతిరేకం. వాళ్ల వాళ్ల పార్టీల్లో నుంచి నేతలు బీజేపీలో చేరకుండా అడ్డుకునేందుకు వైసీపీ, టీడీపీలే పొత్తుల ప్రస్తావన తెస్తున్నాయి. బీజేపీని దించడానికి ఎవరితోనైనా కలుస్తామని నారాయణ చెబుతున్నారు. పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ వంటి దేశాలతో నారాయణ కలుస్తారా..?కమ్యూనిస్టు మాటలు.. కామెడీ మాటలు ఒకటే.బీజేపీ-జనసేన విడివిడిగా ఉద్యమాలు చేయాలనేది మాకున్న ఒప్పందం.ఇద్దరం విడివిడిగా పని చేస్తే.. ఎక్కువ మందికి చేరువ కావచ్చు అన్నారు విష్ణు వర్థన్ రెడ్డి.
ఇదిలా వుంటే.. చిత్తూరు జిల్లాలో అధికారుల వైఖరి.. అధికార పార్టీ నేతల వల్ల రైతు మరణించడం దారుణం అన్నారు విష్ణువర్థన్ రెడ్డి. మరణించిన రైతు కుటుంబానికి రూ. 50 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు మరణించిన ఘటనను జాతీయ మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్తాం.రైతు మరణానికి కారణాలపై విచారణకు ఏకసభ్య కమిషన్ వేయాలి…రైతు మరణానికి కారకులైన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలన్నారు బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి.
Read Also:Chiranjeevi – Tamilisai: 50 సార్లకు పైగా రక్తదానం చేసిన వారికి చిరు భద్రతా కార్డు