గల్ఫ్ దేశంలో త్వరలోనే ఐఐటి ఢిల్లీ ప్రవాస క్యాంపస్‌ను ప్రారంభించనుంది. అక్కడ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు విద్యా మంత్రిత్వ శాఖ మరియు అబుదాబి విద్యా మరియు నాలెడ్జ్ శాఖ (ADEK) ఒప్పందంపై సంతకం చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పర్యటన సందర్భంగా అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు చేశారు. మరోవైపు యూఏఈ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి అబుదాబి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. ఐఐటీని గ్లోబల్‌గా మార్చే ప్రచారంలో భాగంగా ఈ చర్య తీసుకోబడింది. ఈ పరిణామంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు.
Devara: ఆ దేవరే ఫాస్ట్ అంటే ఈ దేవర మరింత ఫాస్ట్ గా ఉన్నాడే
ఈ సమాచారాన్ని తెలియజేస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేస్తూ, “ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో ఐఐటి ఢిల్లీ అబుదాబి క్యాంపస్‌ను ఏర్పాటు చేయడానికి ఎంఒయుపై సంతకం చేయడంతో భారతీయ విద్య అంతర్జాతీయికరణలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది” అని తెలిపారు. విద్య అనేది మానవాళిని కలిపే బంధం అని, భారతదేశపు సృజనాత్మక శక్తికి ఇక్కడ ఐఐటి ఢిల్లీ ఏర్పాటు కీలకం అవుతుందన్నారు. ఇప్పటికే ఐఐటి మద్రాసు గత వారం టాంజెనియాలోని జంజిబార్‌లో ఆఫ్‌షోర్ క్యాంపస్ ఏర్పాటుకు అంగీకారం కుదుర్చుకుంది. దీని తరువాత ఐఐటి ఢిల్లీ ఆఫ్‌షోర్ క్యాంపస్ ఏర్పాటు కానుంది. అబూధాబిలో వెలిసే ఐఐటి ఢిల్లీ క్యాంపస్‌లో వచ్చే ఏడాది జనవరి నుంచి మాస్టర్స్ కోర్సులు ప్రారంభంకానున్నాయి. సెప్టెంబర్ నుంచి డిగ్రీ కోర్సులు ప్రారంభిస్తారని అధికారికంగా వెల్లడించారు.