హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. వివిధ రంగాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలలో భాగంగా బ్యాంకుల సహాయంతో లోన్స్ పొంది.. పెద్ద ఎంటర్ ప్రెన్యూర్స్ గా ఎదుగుతున్న వారు వారి వారి అనుభవాల్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ఎదుగుతున్న యువ పారిశ్రామికవేత్తలు తమ అనుభవాలను వెల్లడించారు. ముఖ్యంగా మహిళ పారిశ్రామిక వేత్తలు బ్యాంక్‌ల ద్వారా తమకు అందుతున్న సహాయాన్ని తెలిపారు. ఈ సమావేశం బంజారాహిల్స్ రోడ్ నెం.1 బంజారా ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువ పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు.
Read Also: Maamannan Collections: బాక్సాఫీస్ వద్ద రచ్చ రేపుతున్న ”మామన్నన్”
కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా బ్యాంక్ ల సహాయంతో ఎదుగుతున్న యువ పారిశ్రామిక వేత్తలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మీరు ఎంచుకున్న రంగంలో మీ అనుభవాల్ని పంచుకోవాలని ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నామన్నారు. మీ ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని మోదీ సూచించారని ఆయన పేర్కొన్నారు. మీ అనుభవాలను పరిగణలోకి కొత్త పథకాలను యువతకు అందించొచ్చు అనే ఉద్దేశంతో ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని చేపట్టారని కిషన్ రెడ్డి వెల్లడించారు. 2014 తర్వాత మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశం అన్ని రంగాల్లో అద్భుతమైన పురోగతి సాధించిందని తెలిపారు. దేశ యువత కోసం అనేక రకాల సంక్షేమ పథకాల ద్వారా ఉపాధి, ఉద్యోగా అవకాశాలు కల్పించారని కిషన్ రెడ్డి సూచించారు. అందులో భాగంగానే ‘ముద్ర యోజన’ ద్వారా దేశ ఔత్సాహిక యువతను మోదీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కిషన్ రెడ్డి అన్నారు.
Read Also: Disha Patani: బాబోయ్.. ఇంత హాట్ అయితే తట్టుకోవడం కష్టమే..
మరోవైపు ఉత్తమ పారిశ్రామిక వేత్తలుగా ఎదుగుతూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారని కేంద్రమంత్రి తెలిపారు. స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ద్వారా అనేక మంది యువత రుణాలు పొంది.. వారి వారి రంగాలలో దేశ ఆర్ధిక పురోభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారన్నారు. ఎటువంటి గ్యారంటీ లేకుండా ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అనే నినాదంతో.. సుమారుగా 19లక్షల కోట్ల రూపాయల వరకు ముద్ర రుణాల ద్వారా దేశ యువత సొంతంగా వ్యాపారాలు, పరిశ్రమలు స్థాపించుకునేందుకు దోహదపడిందని ఆయన పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రవేశ పెట్టిన పథకాలు.. ప్రతి ఒక్కరికి చేరాలన్న ఉదేశ్యంతో ఇటువంటి కార్యక్రమలు ఉపయోగపడతున్నామని కిషన్ రెడ్డి అన్నారు.