Virendra Kumar: సైకిల్ కు పంక్చర్లు వేసే స్థాయి నుంచి మూడు సార్లు కేంద్ర మంత్రిగా..ఎవరో తెలుసా?
- ఎనిమిది సార్లు ఎంపీగా గెలిచిన వీరేంద్ర కుమార్
- ఈ సారి కూడా భారీ మెజార్టీతో విజయం
- ఆర్ఎస్ఎస్ నుంచి మొదలైన ప్రయాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌కు చెందిన ప్రముఖ నాయకుడు, 8 సార్లు ఎంపీగా గెలిచిన వీరేంద్ర కుమార్ ఖాటిక్ మోడీ 3.0 కేబినెట్‌లో మంత్రి అయ్యారు. ఖాటిక్ టికామ్‌గఢ్ నుంచి ఎంపీగా గెలుపొందారు. అతని సింప్లిసిటీ కారణంగా పలు మార్లు ఆయన వార్తల్లో నిలిచారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి వీరేంద్ర ఖటిక్ కాంగ్రెస్‌కు చెందిన పంకజ్ అహిర్వార్‌పై 4 లక్షలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయనకు సామాజిక న్యాయం, సాధికారత శాఖ బాధ్యతలు అప్పగించారు.
READ MORE: Toothache : ఈ చిన్న చిట్కాలు పాటిస్తే.. పంటి నొప్పి నుంచి ఉపశమనం ఖాయం!
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
మోడీ కేబినెట్‌లో వీరేంద్ర కుమార్ ఖటిక్ మూడోసారి మంత్రి అయ్యారు. 2017లో తొలిసారిగా, ప్రధాని మోడీ క్యాబినెట్‌లో ఖాటిక్ మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2021లో సామాజిక న్యాయం, సాధికారత మంత్రిగా నియమితులయ్యారు. 1954 ఫిబ్రవరి 27న సాగర్ జిల్లాలోని అత్యంత పేద కుటుంబంలో జన్మించిన వీరేంద్ర కుమార్ ఖాటిక్.. తన కష్టార్జితం ఆధారంగా సాగర్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. చదువు కోసం ఖాటిక్ సైకిళ్ల రిపేర్ నుంచి వాహనాల రిపేర్ వరకు పని చేయాల్సి వచ్చేది.
వీరేంద్ర ఖటిక్ ఇంతకు ముందు పంక్చర్ వేశారు..
డాక్టర్ వీరేంద్ర ఖటిక్ తండ్రికి మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో సైకిల్ రిపేరింగ్ షాప్ ఉంది. వీరేంద్ర ఖటిక్ ప్రకారం.. చిన్నప్పుడు కుటుంబ పరిస్థితుల వల్ల ఆయన పంక్చర్లు వేయడం, సైకిల్ రిపేర్ చేసేవారు. 2019లో ఓ కార్యక్రమంలో దివ్యాంగులకు ఇచ్చే ట్రైసైకిళ్లలో గాలి తక్కువగా ఉండడంతో ఎంపీ వీరేంద్ర ఖటిక్ స్వయంగా పంపుతో చక్రాల్లో గాలి నింపారు. అనంతరం వారికి పంచిపెట్టారు. అతని సింప్లిసిటీని కూడా ఆ వ్యక్తులు కెమెరాలో బంధించారు.
READ MORE: Seethakka: ప్రజా భవన్ను మంత్రి సీతక్క ఆకస్మిక సందర్శన.. ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరణ
కాగా.. ఆయన 1975లో లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ ప్రారంభించిన సంపూర్ణ విప్లవోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా పోరాడి 16 నెలల జైలు శిక్ష అనుభవించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఉద్యమాన్ని ప్రారంభించారు. వారు చదువుకుని రాణించేందుకు లైబ్రరీని ఏర్పాటు చేశారు. 1982లో రాజకీయాల్లో చేరి, అప్పటి నుంచి బీజేపీ ప్రారంభించిన జాతీయ, రాష్ట్ర, స్థానిక ఉద్యమాలు, కార్యక్రమాలతో చురుగ్గా అనుబంధం కలిగి ఉన్నారు. దళిత నాయకుడు వీరేంద్ర కుమార్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని తికమ్‌గఢ్ నియోజకవర్గాన్ని 8వసారి నిలబెట్టుకున్నారు. అత్యంత సీనియర్ ఎంపీలలో ఒకరు.
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!