భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా వృద్ధి చెందుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ప్రపంచ బ్యాంకు మంగళవారం (జూన్ 11) 2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనా 6.6%గా ఉంటుందని అభిప్రాయపడింది. ప్రపంచ బ్యాంకు ప్రకారం.. వస్తు తయారీ, రియల్ ఎస్టేట్‌లో మరింత వృద్ధి ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి అంచనాను 20 బేసిస్ పాయింట్లు పెంచి 6.6 శాతానికి చేర్చింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచిపోతుందని గ్లోబల్ ఏజెన్సీ పేర్కొంది. అయితే.. భారత ఆర్థిక వ్యవస్థ విస్తరణ వేగం ఓ మోస్తరుగా ఉంటుందని అంచనా.
READ MORE: Jammu Kashmir: పుల్వామాలో మూడు దశాబ్దాల తర్వాత తెరుచుకున్న ఆలయ తలుపులు
ప్రపంచ బ్యాంక్ 2024-25 నుంచి మూడు ఆర్థిక సంవత్సరాల్లో సగటున 6.7% వార్షిక వృద్ధిని అంచనా వేసింది. 2024లో దక్షిణాసియాలో మొత్తం వృద్ధి రేటు 6.0 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు మంగళవారం తన కొత్త దక్షిణాసియా ఆర్థిక వృద్ధి అంచనాలో పేర్కొంది. 2024 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో అంటే జనవరి నుంచి మార్చి 2024 వరకు GDP వృద్ధి 7.8%గా ఉంది. అదే సమయంలో.. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో అంటే, Q4FY23, GDP వృద్ధి 6.1%గా నమోదైంది. ఇటీవల ప్రభుత్వం 2024 ఆర్థిక సంవత్సరానికి GDP యొక్క తాత్కాలిక అంచనాను కూడా విడుదల చేసింది. FY24లో GDP వృద్ధి 8.2%. గత ఆర్థిక సంవత్సరం అంటే FY23లో GDP వృద్ధి 7%. అదే సమయంలో FY24 యొక్క GDP వృద్ధి రిజర్వ్ బ్యాంక్ అంచనా 7% కంటే 1.2% ఎక్కువగా అంచనా వేసింది.