ఏలూరులో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతదేహానికి అంత్యక్రియలు ముగిశాయి. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఉపాధ్యాయ ఉద్యమ నేత, శాసనమండలి సభ్యులు షేక్ సాబ్జీ అంతిమయాత్ర ఆదివారం ఏలూరులో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏలూరుకు వెళ్లిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు సాబ్జీకి నివాళులర్పించారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద జరిగిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. షేక్ సాబ్జీ మరణం ప్రమాదం కాదు, హత్య అంటూ ఆయన కొడుకు, సోదరుడు ఆరోపిస్తున్నారు.