బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పొలిటికల్ రీ ఎంట్రీకి గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారా? రాష్ట్రమంతటా పర్యటించాలనుకుంటున్నారా? ఆమె ఎదురు చూస్తున్న అవకాశం రానే వస్తోందా? అతి త్వరలోనే ఆమె యాక్టివ్‌గా తిరగబోతున్నారా? కవిత రీ ఎంట్రీ విషయంలో జరుగుతున్న ప్రచారం ఏంటి? అందులో నిజమెంత? ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత… ఇకపై బీఆర్‌ఎస్‌లో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారంటూ..ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది తెలంగాణ రాజకీయ వర్గాల్లో. అయితే… ప్రస్తుతం పార్టీ వర్గాల నుంచి అందుతున్న…
MLC Kavitha: ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్‌తో ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారిగా కవిత తన తండ్రిని కలిశారు. కవిత తన భర్త, కుమారుడితో కలిసి ఈరోజు మధ్యాహ్నం ఎర్రవెల్లి నివాసానికి వెళ్లారు.
MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌ను కలవనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఆమె ఇంటి నుంచి ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లనున్నారు.
కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలపై కీలక చర్చ.. కేబినెట్ మీటింగ్ లో మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తన కారణంగా ఇన్నాళ్లు నిర్మించుకున్న మంచిపేరు దెబ్బతింటోందని సీఎం తెలిపారు. మీడియా నిండా వాళ్లు చేసిన పొరపాట్లను ప్రస్తావిస్తూ వార్తలు వస్తున్నాయన్నారు. దీని వల్ల అందరికి చెడ్డ పేరు వస్తోందని చెప్పారు. మంత్రులు కూడా జాగ్రత్తగా ఉండాలని.. జిల్లాలోని ఎమ్మెల్యేలు, నాయకులను మంత్రులే గైడ్ చేయాలని సూచించారు. ఇకపై ఇలాంటివి…
ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ఎమ్మెల్సీ కవిత చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెకు బీఆర్‌ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అయితే.. ఈ సందర్భంగా కవితపై పార్టీ శ్రేణులు పూలవర్షం కురిపించాయి. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన వారిని చూసిన కవిత పిడికిలి బిగించి జై తెలంగాణ అంటూ నినదించారు. అనంతరం భారీ కార్ల ర్యాలీతో సాయంత్రం జూబ్లీహిల్స్‌ని నివాసానికి చేరుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తుందని ఆమె అన్నారు.…
ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి విడుదలైన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్సీ కె. కవిత బుధవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమెను బెయిల్‌పై విడుదల చేయాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది . శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆమెకు ఘనంగా స్వాగతం పలికేందుకు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. తీహార్ జైల్లో ఉన్న కవిత దాదాపు ఐదున్నర నెలల తర్వాత హైదరాబాద్‌కు వచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు…
బెయిల్ మీద విడుదలైన కవిత.. శశికళలా ఆవేశపడి బీజేపీ పెద్దలపై స్టేట్‌మెంట్లు ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు మాజీ ఎంపీ, బీజేపీ నేత టీజీ వెంకటేష్. బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకుంటే.. ఏ కేసీఆర్‌నో.. ఏ కేటీఆర్‌నో అరెస్ట్ చేసేవాళ్లమన్న ఆయన.. కానీ, కవిత చేసిన చెడుసావాసాల వల్లే ఆమెకు ఈ పరిస్థితి ఏర్పడింది అన్నారు.. వాస్తవాలు తెలుసుకోకుండా శశికళల ఆవేశపడి పనికిరాని స్టేట్‌మెంట్లు ఇస్తే ఆమెకే నష్టమన్నారు. ఇక, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం అనే వార్తలు…
తీహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత విడుదల అయింది. సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి బయటకొచ్చారు. లిక్కర్ కేసులో కవితకు ట్రయల్ కోర్టు రిలీజ్ వారెంట్ ఇచ్చింది.
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బెయిల్ పై విచారణ జరుగుతున్నప్పుడు జడ్జి చెప్పే వరకు తెలియదు.. కానీ కవిత బెయిల్ పై మూడు నాలుగు రోజుల నుండి కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం చేసిందని తెలిపారు. కేటీఆర్ రెండు రోజుల ముందే ఢిల్లీలో హడావుడి చేశారని.. జడ్జి చెప్పాల్సిన జడ్జిమెంట్ బీఆర్ఎస్ చెప్పేసిందని పేర్కొన్నారు.