MLC Kavitha : న్యాయం గెలుస్తది నిజం నిలబడుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ఎమ్మెల్సీ కవిత చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెకు బీఆర్‌ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అయితే.. ఈ సందర్భంగా కవితపై పార్టీ శ్రేణులు పూలవర్షం కురిపించాయి. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన వారిని చూసిన కవిత పిడికిలి బిగించి జై తెలంగాణ అంటూ నినదించారు. అనంతరం భారీ కార్ల ర్యాలీతో సాయంత్రం జూబ్లీహిల్స్‌ని నివాసానికి చేరుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తుందని ఆమె అన్నారు. న్యాయబద్ధమైన పోరాటం ఎప్పటికైనా విజయం సాధిస్తుందని, నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి.. కచ్చితంగా ఒక రోజు న్యాయం గెలుస్తుందన్నారు. నిజం నిలకడమీద తెలుస్తుందని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నానని ఆమె అన్నారు. కడిగిన ముత్యంలా కేసు నుంచి బయటకు వస్తా అని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా క్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తామని, నిజం కోసం పోరాటం చేస్తూనే ఉంటా అని కవిత వ్యాఖ్యానించారు.
INS Arighat: ఐఎన్ఎస్ అరిఘాత్.. భారతదేశ రెండో అణు జలంతర్గామి రేపు ప్రారంభం..
చరిత్రలో ఎప్పుడైనా న్యాయం ధర్మం గెలుస్తుందని విన్నాం చూశాం.. అది భారతదేశములోనైనా తెలంగాణ లోనైనా.. నా విషయంలో కూడా న్యాయం గెలుస్తుంది.. ధర్మం గెలుస్తుంది.. అదే జరుగుతుందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అనేక పోరాటాల్లో పాల్గొంటానని ఆమె తెలిపారు. ఈ అపవాదులను తట్టుకొని కడిగిన ముత్యంలా వస్తాను నాకు విశ్వాసం ఉందని ఆమె అన్నారు. అయితే.. తన ఇంటికి చేరుకున్న అనంతరం సోదరుడు కేటీఆర్ కు రాఖీ కట్టారు కవిత. తన కుటుంబ సభ్యులను ఆలింగనం చేసుకున్న కవిత.. తన తల్లి శోభమ్మ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఎమ్మెల్సీ కవితకు మంగళహారతి ఇచ్చి ఇంట్లోకి స్వాగతం పలికారు కుటుంబ సభ్యులు.. కుటుంబ సభ్యులను చూసి ఆలింగనం చేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు కవిత.. కవితను చూసి కుటుంబ సభ్యులు సైతం భావోద్వేగానికి లోనయ్యారు. పూజ గదిలో దేవుని చిత్రపటాల ముందు సాష్టాంగ నమస్కారం చేశారు కవిత.
Also Read
- Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
- Lal Hit Janata Party: దసరా నుంచే ‘‘CJP’’ పతనం.. ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ప్రారంభం..
- Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
- AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
Ambati Rambabu: గతంలో జగన్ చేసిన కృషి వల్లే పోలవరానికి నిధులు..
తాజావార్తలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
-
Lal Hit Janata Party: దసరా నుంచే ‘‘CJP’’ పతనం.. ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ప్రారంభం..
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!